Top
logo

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనంశంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం స్వాధీనం
Highlights

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. సింగాపూర్ నుండి స్కాట్ ఎయిర్‌లైన్స్...

శంషాబాద్ ఎయిర్‌ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడింది. సింగాపూర్ నుండి స్కాట్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో తెల్లవారుజామున హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడు అనుమానస్పదంగా కనిపించడంతో సిఐఎస్‌ఎఫ్ సిబ్బంది అతడ్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితుడు బంగారాన్ని ఫేస్ట్‌గా మార్చి రెండు ప్యాకెట్లు సాక్సులలో , మరో రెండు ప్యాకెట్లు లోదుస్తులలో దాచి తీసుకువస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడుకు చెందిన ఈ ప్రయాణికుడి నుంచి 1100 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకుని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.


Web Titlegold seized at shamshabad airport
Next Story


లైవ్ టీవి