Top
logo

భద్రాచలం దగ్గర పెరిగిన వరద ఉధృతి

భద్రాచలం దగ్గర పెరిగిన వరద ఉధృతి
Highlights

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. వర్షాలకు గోదావరిలో ...

రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం స్తంభించింది. వర్షాలకు గోదావరిలో వరద ఉధృతి సైతం పెరిగింది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 44 అడుగులకు చేరింది. మరో మూడు నుంచి నాలుగు అడుగులు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో అధికారులను మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఇటు తాలిపేరు ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 24 గేట్లను ఎత్తి లక్షా,34వేల ,600 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతవాగు ఉప్పొంగింది. సీతమ్మవారి విగ్రహం, నార చీరల గుర్తులు పూర్తిగా నీట మునిగాయి. దీంత ఆ ప్రాంతానికి రాకపోకలు నిలిపేశారు అధికారులు.

Next Story


లైవ్ టీవి