logo

సికింద్రాబాద్‌లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు..

సికింద్రాబాద్‌లో గ్యాస్ సిలిండర్ లీకై మంటలు..
Highlights

నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్వప్న హోటల్లో గ్యాస్ సిలిండర్ లీక్...

నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న స్వప్న హోటల్లో గ్యాస్ సిలిండర్ లీక్ కలకలం సృష్టించింది. గ్యాస్ సిలిండర్ లీక్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే వంటమాస్టర్ ఒక్కడే మంటలు వస్తున్న గ్యాస్‌ సిలిండర్‌ను ధైర్యంతో బయటకు తీసుకెళ్లాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఇటు ఈ ఘటనతో హోటల్‌ కస్టమర్లు, డార్మెటరీలు లాడ్జిలో ఉన్నవాళ్లు ఒక్కసారిగా భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.


లైవ్ టీవి


Share it
Top