Top
logo

హైదరాబాద్‌లో గణేష్ మహానిమజ్జనానికి సర్వం సిద్దం

హైదరాబాద్‌లో గణేష్ మహానిమజ్జనానికి సర్వం సిద్దం
Highlights

హైదరాబాద్‌లో గణేష్ మహానిమజ్జనానికి సర్వంసిద్ధమైంది. మొత్తం 18 ప్రధాన మార్గాల్లో జరగనున్న శోభాయాత్రకు పోలీసులు...

హైదరాబాద్‌లో గణేష్ మహానిమజ్జనానికి సర్వంసిద్ధమైంది. మొత్తం 18 ప్రధాన మార్గాల్లో జరగనున్న శోభాయాత్రకు పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. నగరవ్యాప్థంగా 40వేల మంది పోలీసులను మోహరిస్తున్నారు. ఇక ఓల్డ్ సిటీ సమస్యాత్మక ప్రాంతాల్లో కేంద్ర బలగాలను రంగంలోకి దింపుతున్నారు.

ఒకవైపు లా అండ్ ఆర్డర్... మరోవైపు ట్రాఫిక్ పోలీసులు... పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. మొత్తం 18 ప్రధాన మార్గాల్లో సాగే గణేష్ శోభాయాత్రలో ఏ చిన్న ఇబ్బందీ తలెత్తకుండా 40వేల మంది పోలీసులతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే శోభాయాత్రను గూగుల్‌ లింక్ సిస్టిమ్‌తో కనెక్ట్ చేయనున్నారు. 305 సమస్యాత్మక, 610 అతి సమస్మాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బలగాలను మోహరిస్తున్నారు.

అలాగే 450కి పైగా సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. మహానిమజ్జనం రోజు హైదరాబాద్‌లో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పోలీసులు తెలిపారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురుకాకుండా రూట్ మ్యాప్‌ను రెడీ చేశారు. బాలాపూర్‌-ట్యాంక్ బండ్ ‌రూట్‌లో మొత్తం 21 కిలోమీటర్ల మేర శోభాయాత్ర జరగనుండటంతో... సున్నితమైన ప్రాంతాల్లో పెద్దఎత్తున బలగాలను మోహరిస్తున్నారు.

Next Story


లైవ్ టీవి