ఒక్క ఫోన్‌తో గణపతి ప్రసాదం మీ ఇంటికే..

ఒక్క ఫోన్‌తో గణపతి ప్రసాదం మీ ఇంటికే..
x
Highlights

హైదరాబాద్ ఇదో మహాసముద్రం. ఉరుకులు, పరుగుల జీవితానికి కేరాఫ్ అడ్రస్. నిత్యం ఉద్యోగం, కుటుంబం, ట్రాఫిక్ సమస్యలతో ఫుల్ బిజి బిజీగా గడుపుతుంటారు పట్టణవాసులు. దైవ భక్తి గురించి పట్టించుకునే వారు కొద్దిమంది ఉంటారు.

హైదరాబాద్ ఇదో మహాసముద్రం. ఉరుకులు, పరుగుల జీవితానికి కేరాఫ్ అడ్రస్. నిత్యం ఉద్యోగం, కుటుంబం, ట్రాఫిక్ సమస్యలతో ఫుల్ బిజి బిజీగా గడుపుతుంటారు పట్టణవాసులు. దైవ భక్తి గురించి పట్టించుకునే వారు కొద్దిమంది ఉంటారు. అయితే వినాయకచవితి వచ్చేసింది. నగరంలో ఎక్కడ చూసిన వినాయవిగ్రహాలు, పూజలతో నగరం మారుమోగిపోతుంది. అయితే చవితికి సంబంధించిన సమానుకోసం ఇబ్బంది పడుతుంటారు కొందరు. వీటికి తోడు నగరంలో వర్షాలు తోడు అవ్వడంతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వినాయకచవితి సందర్భంగా గణేశుడి ప్రసాదం తినాలని చాలా మందికి ఉంటుంది. కానీ తీరాచూస్తే జనాలు బారులు తీరుతారు.

ఇక అలాంటి వారికోసమే ఆన్‌లైన్‌లో అన్ని రకాల సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. వినాయకచవితి సందర్భంగా విగ్రహాల బుకింగ్స్, పూజా సామాగ్రి అమ్మకాలు ఇలా ప్రతి ఒక్కటి ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇప్పడు వీటికి భిన్నంగా వినాయకచవితి ప్రసాదాన్ని కూడా డోర్ డెలివిరీ చేస్తామంటూ వినూత్నమైన ఆలోచనతో ఆంధ్రా తాలింపు రెస్టారెంట్ ముందుకు వచ్చింది. కేవలం ఒక్క ఫోన్ రింగ్ కొడితే చాలు.. డైరెక్ట్‌గా ప్రసాదాన్ని ఇంటికే పంపిస్తుంది. వినాయకచవితి ప్రసాదం కిట్ పేరుతో ఈ ఆఫర్‌ను హోటల్ నిర్వాహకులు అందిస్తున్నారు. అయితే వీరు అందించే ఈ కిట్‌లో ఏం ఏం పంపుతారంటే.. కిలో ఉండ్రాళ్లు, 10 పూర్ణాలు, 10 గారెలు, హాఫ్ కేజీ పులిహోర, హాఫ్ కేజీ చక్కెర పొంగలి, హాఫ్ కేజీ రవ్వ కేసరి ఉంటాయి. ఈ మొత్తం ప్రసాదం కలిపి ఎంతవుతుందంటే రూ. 470కే అందిస్తున్నార రెస్టారెంట్ నిర్వాహకులు. అయితే ఈ ఆఫర్ కేవలం చవితి ఉత్సవాలు జరుపుకునే 11 రోజులు మాత్రమే అందుబాటులో ఉంచారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories