నేటి నుంచి గాంధీలో ప్లాస్మా చికిత్స

నేటి నుంచి గాంధీలో ప్లాస్మా చికిత్స
x
Highlights

తెలంగాణలో నేటి నుంచి ప్లాస్మా థెరపి అందుబాటులోకి రానుంది. భారత వైద్య మండలి ICMR మార్గదర్శకాలకు అనుగుణంగా.. గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి ప్లాస్మా...

తెలంగాణలో నేటి నుంచి ప్లాస్మా థెరపి అందుబాటులోకి రానుంది. భారత వైద్య మండలి ICMR మార్గదర్శకాలకు అనుగుణంగా.. గాంధీ ఆస్పత్రిలో నేటి నుంచి ప్లాస్మా థెరపిని ప్రారంభిస్తున్నట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. చికిత్సలో భాగంగా ముందుగా కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి రక్తాన్ని సేకరిస్తారు. ఇందుకు 15 మంది విదేశీయులు తాము ప్లాస్మాను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. వీరితో పాటు గతంలో మరో 200 మంది కూడా రక్తం ఇచ్చేందుకు సిద్ధమని ప్రకటించారు. వీరి నుంచి సేకరించిన ప్లాస్మా ద్వారా వ్యాధిగ్రస్తుల్లో యాంటీబాడీస్‌ వృద్ధి చెంది కరోనా వైరస్‌పై పోరాడతాయి. దీంతో బాధితుడు వైరస్ బారి నుంచి బయటపడే అవకాశం ఉంది.

ఒకరి నుంచి సేకరించిన ప్లాస్మా ద్వారా ఇద్దరు రోగులకు చికిత్స చేయవచ్చని గాంధీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ ప్లాస్మా థెరపీ క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగానే నిర్వహిస్తున్నట్లు చెబుతున్నాయి. కరోనా రోగులందరికీ ప్లాస్మా థెరపీ చేయమని వెంటిలెటర్‌పై ఉన్నవారికి, డయాలసిస్‌ రోగులు, ఇతర వ్యాధులుండి ఎక్కువ వయస్సున్న వారికి మాత్రమే ప్లాస్మా చికిత్స అందిస్తామని చెబుతున్నారు. ఎంపిక చేసిన రోగులకు మాత్రమే ప్లాస్మా చికిత్స అందిస్తామంటున్నారు. దీంతో గాంధీలో ప్రస్తుతం ప్లాస్మా థెరపీకి అర్హులైన వారు ఐదుగురు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఒకరి నుంచి సేకరించిన ప్లాస్మా ద్వారా ఇద్దరు రోగులకు చికిత్స అందించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే దాత, రోగి బ్లడ్‌ గ్రూప్‌ జతకలిస్తేనే థెరపీ కుదురుతుందని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories