గాంధీలో కరోనా గర్భిణికి పురుడు.. శిశువుకు నేడు వైద్య పరీక్షలు

గాంధీలో కరోనా గర్భిణికి పురుడు.. శిశువుకు నేడు వైద్య పరీక్షలు
x
Highlights

కరోనా వైరస్ తో బాధపడుతూ గాంధీలో చికిత్స తీసుకుంటున్న నిండుగర్భిణికి వైద్యులు సురక్షితంగా పురుడు పోసారు.

కరోనా వైరస్ తో బాధపడుతూ గాంధీలో చికిత్స తీసుకుంటున్న నిండుగర్భిణికి వైద్యులు సురక్షితంగా పురుడు పోసారు. పూర్తివివరాల్లోకెళ్తే హైదరాబాద్‌ పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన మహిళ (22) ప్రసవం కోసం పేట్లబుర్జు ప్రసూతి ఆస్పత్రికి వెళ్లారు. కాగా ఆ గర్భిణికి కరోణా లక్షణాలు ఉండడంతో వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్షల్లో ఆమెకి కరోనా పాజిటివ్ రావడంతో వెంటనే అక్కడి నుంచి గాంధీకి తరలించారు వైద్యులు. మూడు రోజుల నుంచి గాంధీలో చికిత్స పొందుతున్న ఆమెకు పురుటినొప్పులు రావడంతో వెంటనే వైద్యులు స్పందించారు. ఆమెకి సాధారణ ప్రసవం చేస్తే ప్రమాదం పొంచి ఉండటంతో శుక్రవారం శస్త్రచికిత్స ద్వారా ప్రసవంచేసారు.ఆమెకు మగబిడ్డ జన్మించినట్లు ప్రకటించారు.

ప్రస్తుతం తల్లి బిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నట్లు ఆ స్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం వీరిద్దరిని వేర్వేరు వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పుట్టిన బిడ్డకు కూడా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. గర్భిణి శస్త్ర చికిత్స అందించిన వారిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అనిత, డాక్టర్‌ ప్రసన్నలక్ష్మి, డాక్టర్‌ సింధూ, డాక్టర్‌ మృణాళిని, డాక్టర్‌శ్రీలక్ష్మి, డాక్టర్‌ నాగార్జునలు ఉన్నారు.

తెలంగాణలో నిన్న మ‌రో ప‌ది పాజిటివ్ కేసులు న‌మోదైన‌ట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈట‌ల రాజేందర్ వెల్ల‌డించారు. గ‌డిచిన 24గంట‌ల్లో 34 మంది డిశార్చ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో క‌రానా బారినుంచి 720 మంది కోలుకుని డిశార్జ్ కాగా...గాంధీ ఆసుప‌త్రిలో 376 మంది చికిత్స పొందుతున్నారు. తాజా కేసుల‌తో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య‌ రాష్ట్రంలో 1,132 చేరింది. కోవిడ్ కేసులు ఎక్కువ‌గా ఉన్న జీహెచఎంసీ ప‌రిధీలోనే క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్యుల చేప‌ట్టాని సీఎం ఆదేశాలు ఇచ్చార‌ని మంత్రి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories