టిక్‌ టాక్ చేసిన విద్యార్థులపై వేటు

టిక్‌ టాక్ చేసిన విద్యార్థులపై వేటు
x
Highlights

టిక్‌ టాక్‌. ఆ వీడియోలతో టాలెంట్‌ సంగతేమో కానీ, అసలు పనులు వదిలేసి.. అదే పనిగా పిచ్చిలో మునిగితేలుతున్నారు. టిక్‌ టాక్‌.. ఈ మత్తులో విధులను...

టిక్‌ టాక్‌. ఆ వీడియోలతో టాలెంట్‌ సంగతేమో కానీ, అసలు పనులు వదిలేసి.. అదే పనిగా పిచ్చిలో మునిగితేలుతున్నారు. టిక్‌ టాక్‌.. ఈ మత్తులో విధులను మర్చిపోతున్నారు ఉద్యోగులు. తమ బాధ్యతలు వదిలేసి.. టిక్‌ టాక్‌ లో పాటలు పాడుతూ, డైలాగ్స్‌ చెప్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు. చివరికి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్‌‌లో ఇద్దరు ఇంటెన్‌ షిప్‌ విద్యార్థులు చేసిన టిక్‌ టాక్‌ వైరల్‌గా మారింది. ఇంటెన్‌ షిప్‌కు వచ్చి.. వైద్యం గురించి తెలుసుకోకుండా ఆడుతూపాడుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఫిజియోథెరపీ డిపార్ట్‌మెంట్‌లో తీసిన ఈ వీడియోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దీంతో గాంధీలో టిక్ ట్యాక్ చేసిన ఇద్దరు ఫిజియోథెరపీ ఇంటెన్ షిప్ విద్యార్థులపై చర్యలు తీసుకున్నారు సూపరింటెండెంట్‌. దీంతో పాటు ఫిజియోథెరపీ డిపార్ట్‌మెంట్‌ ఇంచార్జ్‌కు నోటీసులు పంపించారు. గాంధీ విద్యార్థులకు ఈ వీడియోతో సంబంధం లేదని సూపరింటెండెంట్‌ తెలిపారు. ఇంటెన్‌ షిప్‌ విద్యార్థులు వేరే మెడికల్‌ కాలేజ్‌కి చెందిన వారిగా గాంధీ అధికారి తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories