కరోనా ఉన్నా లక్షణాలు లేకుంటే ఇంటికే

కరోనా ఉన్నా లక్షణాలు లేకుంటే ఇంటికే
x
Highlights

వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి పాజిటివ్ లక్షణాలు లేని వారి బాధితులపై వైద్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

వైద్య పరీక్షల్లో కరోనా నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి పాజిటివ్ లక్షణాలు లేని వారి బాధితులపై వైద్యాధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్ వచ్చిన బాధితులని ఇళ్లకు పంపించేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో సుమారుగా 315 మందిని ఎంపిక చేశారు. వారిలో ముఖ్యంగా 50 ఏళ్ల వయసులోపు ఉన్న వారే ఉన్నారు.

ఈ 315 మంది కరోనా బాధితులు అయినప్పటికీ వారిలో కనీసం జ్వరం, జలుబు, దగ్గు లాంటి లక్షణాలు కూడా కనిపించడం లేదు. అయితే ఇలాంటి వారి వలన వైరస్‌ లోడ్ చాలా తక్కువ స్థాయిలో ఉందని వైద్యులు చెబుతున్నారు. వీరి ద్వారా పెద్దగా ప్రమాదం లేకపోవడంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉంచి సరైన సమయానికి మందులు, భోజనం అందిస్తూ పెద్ద సమస్య ఏం ఉండబోదని అధికారులు చెప్పారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజారావు ఇప్పటికే దీనికి సంబంధించిన సమాచారం అన్ని జిల్లాల వైద్య ఆరోగ్యశాఖాధికారులకు(డీఎంహెచ్‌వో) అందించారు.

కేన్సర్‌, కిడ్నీ సమస్యలు, షుగర్, శిశువులు, గర్భిణులు, వృద్ధులు, హై బీపీ లాంటి దీర్ఘ కాలికి వ్యాధులతో బాధడేవారిని ఆసుపత్రిలోనే ఉంచాలని నిర్ణయించారు. వారు కరోనా నుంచి పూర్తిగా కొలుకున్నాకే వారిని డిశ్చార్జి చేసి ఇండ్లకు పంపిస్తామని తెలిపారు.

ఇక గాంధీ ఆస్పత్రిలో గరిష్ఠంగా 1,500 మందికి మించి చికిత్స అందించే మౌలిక వసతులు లేవు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. ఇక ఇప్పుడు గాంధీలో 500 మంది వరకూ కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

హోం క్వారంటైన్ విషయంలో షరతులు:

బాధితులు 50 ఏళ్ల వయసు లోపు వారై అయి ఉండాలి.

♦ ఎలాంటి దీర్ఘకాలిక రోగాలు ఉండకూడదు.

♦ తక్కువ వయసున్నాసరే జ్వరం, జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటే ఇంటికి పంపరు.


HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి


Show Full Article
Print Article
More On
Next Story
More Stories