'కరోనా' చికిత్సకు కొత్త ఆస్పత్రి

కరోనా చికిత్సకు కొత్త ఆస్పత్రి
x
Representational Image
Highlights

కరోనా బాధితులకు చికిత్సలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం మరో సూపర్ స్పషాలిటీ ఆస్పత్రిని సిద్దం చేసింది.

కరోనా బాధితులకు చికిత్సలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం మరో సూపర్ స్పషాలిటీ ఆస్పత్రిని సిద్దం చేసింది. కరోనా బాధితుల సంఖ్య రాష్ట్రంలో పెరిగిపోవడంతో ఆస్పత్రలన్నీ నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ ఆస్పత్రిని సిద్దం చేసింది. ఇప్పటికే నగరంలోని గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ లాంటి ఆస్పత్రులను కరోనా ఆస్పత్రులుగా మార్చేసారు. అయినా రోగుల సంఖ్య అధికమవుతుండడంతో చైనా తరహాలో 1500 పడకల ఆస్పత్రిని తెలంగాణ సర్కార్‌ ఏర్పాటు చేసింది. ఒక్క సారిగా బాధితుల సంఖ్య పెరిగితే వారికి ఆలస్యం కాకుండా చికిత్స అందిందచేందుకు గచ్చిబౌలీలోని స్పోర్ట్స్‌ సెంటర్‌ను కరోనా ఆస్పత్రిగా ప్రభుత్వం మార్చేసింది.

ఉస్మానియాకు అనుబంధంగా 'తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విత్‌ పీజీ కాలేజ్‌)' పేరుతో గచ్చిబౌలి క్రీడాప్రాంగణంలోని 13 అంతస్తుల భవనంలో 1,500 పడకలతో ఏర్పాటైన ఈ ఆస్పత్రిలో సోమవారం నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న ఐటీ కారిడార్‌లోని హైటెక్‌సిటీ, నానక్‌రాంగూడ, మాదాపూర్‌తో పాటు టోలిచౌకి, గోల్కొండ, వికారాబాద్‌ నుంచి వచ్చే వారు సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి వెల్లకుండా ఈ ఆస్పత్రిలోనే వైద్యసేవలు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది.

ప్రస్తుతం ఆ ఆస్పత్రిలో కరోనా బాధితుకు వైద్య సేవలు అందిస్తున్నామని, వైరస్ తగ్గుముఖం పట్టిన తరువాత దీన్ని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా రూపుదిద్దుతామని అధికారులు తెలిపారు. కాలేయం, కిడ్నీ,ఆర్థోపెడిక్‌, అత్యవసర వైద్యం, గుండె వంటి వైద్యసేవల్ని ఈ ఆస్పత్రి ద్వారా అందించనున్నారు. ఈ ఆస్పత్రిలో ఇప్పటి వరకు ఆక్సిజన్‌ సరఫరా, సివిల్‌వర్క్స్‌ పనులన్నీ పూర్తయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో మిషన్ భగీరథ ద్వారా ఈ ఆస్పత్రిలో నీటిని అందించే ప్రయత్నం చేస్తామని, ప్రస్తుతం నీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories