పండగ వేళ.. ప్రయాణం నరకం

పండగ వేళ.. ప్రయాణం నరకం
x
Highlights

ఇదేమి కొత్తేమి కాదు .. అలా అని వింతేమి కాదు కూడా . ప్రతి పండగకి జరిగేది.. ప్రతి పండగకి ఉండేదే.. సంక్రాంతి పండగ కోసం

పండగొచ్చింది..పట్నం పల్లెబాట పట్టింది. ఏడాది మొత్తం తమ వారికి దూరంగా పొట్టకూటి కోసం పట్టణంలో బతుకీడుస్తున్న జనాళి.. పల్లె ఒడిలో సేదతీరి పండగ చేసుకోను బయలెల్లాడు.సంవత్సరం మొత్తం కష్టమొక ఎత్తు..ఊరికి పోయే ముచ్చట్లకు రవాణా వ్యవస్థ పొడుస్తున్న తూట్లు ఒకెత్తు. పరిస్థితి ఎలా వుందంటే..పండగ ప్రయాణం నరకమన్నట్టుంది.

ఇదేమి కొత్తేమి కాదు .. ప్రతి పండగకి జరిగేది.. ప్రతి పండగకి ఉండేదే.. సంక్రాంతి పండగ కోసం నగరవాసులు పట్నం నుంచి పల్లెటూరులకి తరలివెళ్తున్నారు. ఇందులో కొందరు రైళ్లల్లో వెళ్తుండగా, మరికొందరు బస్సుల్లో, ఇంకొందరు సొంత వాహనాల్లో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ప్రయాణికుల సంఖ్య ఎక్కువ అవడం, వారికి తగినన్ని బస్సులు, ట్రైన్స్ అధికారులు కలిపించకపోవడంతో పండగ వేళ ప్రయాణం నరకం లాగా కనిపిస్తుంది.

వేలాది మంది నగరవాసులు ఒక్కసారిగా ఊళ్లకు బయలుదేరడంతో హైదరాబాద్ లోని ప్రధాన బస్టాండులన్నీ రద్దీగా మారాయి. ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి. స్కూళ్లకు సెలవులు రావడంతో నగరవాసులు ఉదయం నుంచే ఎంజీబీఎస్, జూబ్లీ బస్టాండ్ తో పాటు జంట నగరాల్లోని ప్రధాన బస్టాండ్లకు చేరుకుంటున్నారు. దీంతో సంక్రాంతి రష్ భారీగా పెరిగింది. ఇప్పటికే బస్సుల్లో సీట్లు లేక, వెయిటింగ్ లిస్ట్ రావడంతో.. అందరూ బస్టాండ్స్ కు చేరుకుని, స్పెషల్ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూస్తున్నారు. స్పెషల్ బస్సుల్లో అధిక ధరలు వసూలు చేయడంతో పాటు బస్సుల కోసం గంటలకొద్ది ఎదురు చూడాల్సి వస్తోందని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మెట్రోలో, రైళ్లల్లో కూడా ప్రయాణికులు రద్దీ ఎక్కువైంది.

ఇక దీనికి తోడు ఇప్పుడు ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారిపోయాయి. ముఖ్యంగా హైవేల వద్ద, టోల్ ప్లాజాల దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. వాహనాలు కిలోమీటర్ వరకు ట్రాపిక్ తో కూడుకొని ఉండడంతో ప్రయాణికులుకి సొంతూరు ప్రయాణం ఇబ్బందిగా మారింది. దీనికితోడు టోల్ ట్యాక్స్ పేరిట జేబులకు భారీగా చిల్లుపడుతోంది. అంతేకాకుండా టోల్‌ ఫీజు చెల్లించేందుకు సుమారు గంట వరకు వెయిట్ చేయాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో 25 వేల వరకు వాహనాలు వెళ్తుండగా.. ఇవాళ ఒక్క రోజే సుమారు 50వేలకు పైగా వాహనాలు వెళ్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక పండగకి క్యాష్ చేసుకునేందుకు కొందరు దుకాణాదారులు ఎక్కువ రెట్లు పెంచి దోపిడీకి దిగుతున్నారు. కొన్ని బస్టాండ్ లలో మామలు వాటర్ బాటిల్ ధర 20 రూపాయలుగా ఉంటే 25 నుంచి ముప్పై రూపాయలకి అమ్ముతున్నారు. ఇక వీటితో పాటు తినుబండారాలకి కూడా రెట్లును పెంచుతున్నారు. మొత్తానికి పండగ ప్రయాణం సామాన్య ప్రయాణికుడికి చుక్కలు చూపిస్తుంది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories