మేడారం భక్తులకు బీఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై

మేడారం భక్తులకు బీఎస్ఎన్ఎల్ ఉచిత వైఫై
x
Highlights

మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని సదుపాయాలను చేసిన విషయం అందరికీ తెలిసిందే.

మేడారం వెళ్లే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని సదుపాయాలను చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే కోణంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్-BSNL కూడా భక్తులకోసం ఒక మంచి సదుపాయాన్ని కల్పించింది. జాతరకు వెళ్లే భక్తులకు బోర్ కొట్టకుండా ఉండడానికి ఫ్రీ వైఫై సదుపాయాన్ని కల్పించింది.

ఈ వైఫై సేవలు ఫిబ్రవరి 5 నుంచి 9వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ సేవలకు భక్తులకు నిరంతరం అందించడానికి 20 వైఫై హాట్ స్పాట్లను బీఎస్ఎన్ఎల్ ఏర్పాటు చేసింది. అంతే కాకుండా పూర్తి నాణ్యమైన సిగ్నల్ కోసం జాతర పరిసర ప్రాంతాల్లో G BTS-13, 3G BTS-14,4G BTS-1 ఇన్‌స్టాల్ చేసారని తెలిపారు. జాతరకు వచ్చే భక్తులు అవసరమైనంతగా ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇక ఈ సేవలను మేడారంలో ఉచితంగా పొందడానికి యూజర్లు ఈ విధంగా తమ స్మార్ట్ ఫోన్ లలో సెట్టింగ్స్ చేసుకోవాలని తెలిపింది. ముందుగా భక్తులు తమ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై ఆన్ చేసుకోవాలి. అది ఆన్ చేయగానే QFI-BSNL-FREE-WIFI@Medaram పేరుతో వైఫై నెట్‌వర్క్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. అప్పుడు దాని మీద క్నిక్ చేసి కనెక్ట్ అవ్వండి.

తరువాత ఇంటర్నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి, మీ మొబైల్ నెంబర్ ను అందులో ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత సెల్ నంబరుకు వచ్చిన నాలుగు అంకెల ఓటీపీని అందులో ఎంటర్ చేసి సరి మీకు బీఎస్ఎన్ఎల్ వారు కల్పించే మేడారం జాతర ఫ్రీ వైఫైని వాడుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మేడారం వెళ్లే భక్తులు సెల్ సిగ్నల్ లేవని చింతించకుండా బీఎస్ఎన్ఎల్ వైఫైని కనెక్ట్ చేసుకోండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories