Top
logo

ఊరంతా చేపల కూరే!

ఊరంతా చేపల కూరే!
X
Highlights

చేపల కూర తినాలని ఎవరికీ ఉండదు? అందులోనూ చెరువు చేప అంటే ఊళ్లలో విపరీతంగా ఇష్టపడతారు. అయితే, అందరికీ చేపలు...

చేపల కూర తినాలని ఎవరికీ ఉండదు? అందులోనూ చెరువు చేప అంటే ఊళ్లలో విపరీతంగా ఇష్టపడతారు. అయితే, అందరికీ చేపలు కొనుక్కుని తినేంత అవకాశం ఉండదుగా.. అందుకే..

తెలంగాణా రాష్ట్రంలోని మునగాల మండల కేంద్రంలో ఊరంతటికీ చేపలు పంచిపెట్టాడో పెద్దమనిషి. నల్లపాటి శ్రీనివాస్ అనే ఆయన...స్థానికంగా ఉన్న చెరువులో చేపలు పెంచి.. అమ్ముకోవడానికి కాంట్రాక్టు పొందాడు. ఆయన సోమవారం చెరువులో చేపల్ని పట్టారు. ముందుగా పట్టిన చేపల్ని గ్రామంలోని తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళందరికీ, రెండేసి కిలోల చొప్పున ఉచితంగా పంచిపెట్టారు. తరువాతే మిగిలిన చేపల్ని అమ్మకం కోసం తీసుకువెళ్ళారు. తన చెరువులో ముందు పట్టిన చేపల్ని స్థానికులకు ఉచితంగా ఇవ్వాలని అనుకున్నానని శ్రీనివాస్ చెప్పారు. అన్నట్టు..ఇలా మొత్తం ఎన్ని చేపల్ని ఉచితంగా ఇచ్చాడో తెలుసా.. దాదాపు నలుగున్నర టన్నులు!

Next Story