పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత చాలా మంది ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో స్టడీ సర్కిల్లకు వెళ్లి చదువుకుంటారు.

తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత చాలా మంది ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతో స్టడీ సర్కిల్లకు వెళ్లి చదువుకుంటారు. లేదా కోచింగ్ సెంటర్ లలో వేల కొద్దీ డబ్బులు కట్టి కోచింగ్ తీసుకుంటారు. కానీ పేద కుటుంబంలో పుట్టిన యువత అన్ని వేల డబ్బులను పెట్టుకోలేక ఇంటివద్దనే ఉంటూ వారి చదువులనకు కొనసాగిస్తుంటారు. ఇలాంటి యువత కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది.

ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రధాన స్టడీ సర్కిళ్లను హైదరాబాద్‌లో నిర్వహిస్తుంది. అంతేకాక రాష్ట్రంలోని నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేటల్లో అంటే మొత్తంగా చూసుకుంటే 11 జిల్లాల్లో మాత్రమే స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. దీంతో చాలా మంది యువతకు స్టడీ సర్కిళ్లలో సీట్ దొరకక ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లాల్లోనూ స్టడీ సర్కిళ్లను ఏర్పాటు చేయాలనుకుంటుంది ఎస్సీ అభివృద్ధి శాఖ. ఈ మేరకు కార్యాచరణ రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే అవకాశముందనే అంశాలపై పరిశీలన చేయనుంది.

ఈ సర్కిళ్ల ద్వారా సివిల్‌ సర్వీసెస్, గ్రూప్‌ సర్వీసులు తదితర ప్రధాన శిక్షణ కార్యక్రమాలకు ఇవ్వనున్నారు. ఇప్పటి వరకూ ఈ స్టడీ సర్కిళ్ల ద్వారా దాదాపుగా 2వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారని స్టడీసర్కిల్ శాఖ తెలిపింది. హైదరాబాద్ లో శిక్షణ తీసుకున్న వారిలో దాదాపు 15% మందికి కొలువులు తీసుకొచ్చారని తెలిపారు. ఇకపై వీటిలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన శిక్షణే కాకుండా ప్రైవేటు రంగానికి సంబంధించిన శిక్షణను కూడా ఇవ్వనున్నారని అధికారులు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories