జన్నారంలో కరోనా కలకలం

జన్నారంలో కరోనా కలకలం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు మండలంలో 11 కరోనా కేసులు నమోదు కాగా అందులో ఆరు కరోనా కేసులు శనివారం...

మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఇప్పటివరకు మండలంలో 11 కరోనా కేసులు నమోదు కాగా అందులో ఆరు కరోనా కేసులు శనివారం ఒక్కరోజే నమోదయ్యాయి. పూర్తి వివరాల్లోకివెళితే తపాలపూర్‌కు చెందిన వలస కార్మికుడు ఇటీవలే ముంబై నుంచి గ్రామానికి చేరుకున్నాడు. కాగా అధికారులు అతనికి వైద్య పరీక్షలు చేయగా అతనికి కరోనా నిర్ధారణ అయింది.

దీంతో అప్రమత్తమైన అధికారులు అతనితో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించిన వారి వివరాలు కనుకున్నారు. కార్మికుడితో కలిసి ఒకే వాహనంలో ప్రయాణించిన వారిలో దండేపల్లి మండలం తాళ్లపేటకు చెందిన నలుగురు వ్యక్తులను అధికారులు బెల్లంపల్లి ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. ఆ నలుగురితో ప్రైమరీ కాంటాక్ట్‌ ఉన్న కుటుంబ సభ్యులకు హోం క్వారంటైన్‌ ముద్రలు వేశారు.

కాగా శనివారం నమోదైన కేసులలో తపాలపూర్‌కు చెందిన నలుగురికి, రోటిగూడకు చెందిన ఇద్దరికి, చింతలపల్లికి చెందిన ఒకరు ఉన్నారు. ఈ కేసులతో జన్నారంలో కేసుల సంఖ్య 17కు చేరింది. మంచిర్యాల జిల్లాలో ఈ కేసులతో మొత్తం సంఖ్య 37కు చేరింది.

తెలంగాణలో గత కొద్దీ రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న అధికంగా 74 కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 41 కేసులు వెలుగు చూశాయి. రాష్ట్రం పరిధిలో 60 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 5, సంగారెడ్డి జిల్లాలో 3,మహబూబ్ నగర్ 2, సూర్యాపేట 1, జగిత్యాల 2, వనపర్తి 1, వరంగల్ అర్బన్ 1, వికారాబాద్ 1, మేడ్చల్ 1, నగర్ కర్నూల్ 1, నిజామాబాదు 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. వలస కూలీలు 9, విదేశాల నుంచి వచ్చిన వారిలో 5 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories