ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్...

ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా పాజిటివ్...
x
Highlights

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం మరో నాలుగు కేసులు నమోదవ్వడం వారందరూ ఒకే కుటుంబ సభ్యులు కావడంతో ఆ ప్రాంత ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

రంగారెడ్డి జిల్లా జల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఢిల్లీలో జరిగిని మత ప్రార్థనలకు వెళ్లొచ్చాడు. కాగా అతన్ని అధికారలు పరీక్షించగా అతనికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు అతని భార్య పిల్లలను కూడా క్వారంటైన్‌ కేంద్రానికి పంపించారు. వారి రక్త నమూనాలను సేకరించి ఈనెల 2వ తేదీన పరీక్షలకు పంపించారు. కాగా దాని ఫలితాలు ఆదివారం వచ్చాయి. ఈ ఫలితాల్లో అతడి భార్య, కుమారుడు, కుమార్తెకు కూడా కరోనా పాజిటివ్ కావడంతో స్థానికులు ఖంగు తిన్నారు.

ఈ ముగ్గరిని వైద్య అధికారులు ప్రైమరీ కాంటాక్టులుగా గుర్తించారు. కాగా ఢిల్లీకి వెళ్లొచ్చిన వ్యక్తి అతని కుటుంబ సభ్యలతో సన్నిహితంగా ఉండడంతోనే వైరస్ వ్యాప్తి చెందిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఇక పోతే అతను ఎవరినైతే కలిసారో వారందరిని కూడా వైద్యులు పరీక్షించగా వారికి నెగిటివ్ రిపోర్టు వచ్చింది. రిపోర్టుల్లో పాజిటివ్ వచ్చిన వారిని ప్రస్తుతం గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక పోతే తెలంగాణలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 300 దాటింది. అత్యధికంగా హైదరాబాద్‌ 140మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఏపీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా ఈ రోజు 26 కేసులు నమోదు అయ్యాయి. దీనితో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 252 కు చేరింది. అటు దేశవ్యాప్తంగా 3374 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 79 మంది మృతి చెందారు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories