అయిదు రూపాయలకి నాలుగు ఇడ్లీలు.. ఆహా ఖైదీల ఇడ్లీలకి ఏం గిరాకీ

అయిదు రూపాయలకి నాలుగు ఇడ్లీలు.. ఆహా ఖైదీల ఇడ్లీలకి ఏం గిరాకీ
x
Highlights

సాధారణంగా జైలు ప్రాంగణం ఎలా ఉంటుంది చాలా నిశబ్దంగా గందరగోళం లేకుండా ఉంటుంది. కానీ అక్కడ మాత్రం చాలా హడావిడి కనిపించింది. ఏంటి అని అటుపక్కకి వెళ్తే...

సాధారణంగా జైలు ప్రాంగణం ఎలా ఉంటుంది చాలా నిశబ్దంగా గందరగోళం లేకుండా ఉంటుంది. కానీ అక్కడ మాత్రం చాలా హడావిడి కనిపించింది. ఏంటి అని అటుపక్కకి వెళ్తే అక్కడ అయిదు రూపాయలకి నాలుగు ఇడ్లీలు అని రాసి ఉంది. అది ఎక్కడో కాదు. మహబూబ్‌నగర్ జిల్లా జైలు ప్రాంగణం. ఇక్కడ ఖైదీలతో ఈ క్యాంటీన్ ఏర్పాటు చేశారు అధికారులు. అక్కడి ఖైదీలు చేసిన ఇడ్లీలకి మస్తు గిరాకి వస్తుంది.

తక్కువ ధరలో మంచి రుచికరంతో ఉండడంతో రోజురోజుకి తినేవారి సంఖ్య పెరుగుతుంది. దీనిని మూడు రోజులు కింద మొదలు పెట్టారు. మొదటిరోజు 400 మంది తినగా రెండు రోజు 700 కి చేరింది . ఇక మూడో రోజుకి 1100 మందికి చేరింది. ఇలా ఇడ్లీలు అమ్మడం ద్వారా రోజుకి మూడు వేల వరకు లాభం వస్తుందని చెప్పుకొస్తున్నారు జైలు అధికారులు..

ఇలా చేయడం వల్ల ఖైదిలలో కూడా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. సత్ప్రవర్తనతో ద్వారా బయటకు వచ్చాక ఎవరిపైనా ఆధారపడకుండా స్వతహాగా పని చేసుకొని బ్రకుతారని చెప్పుకొస్తున్నారు. జైలు అధికారులు చేస్తున్న ఈ పనికి నెటిజన్లు నుండి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories