ఒకే కుటుంబంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు

ఒకే కుటుంబంలో నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు
x
Highlights

లవారిది ఒక సామాన్య రైతు కుటుంబం. ఆరుగాలం శ్రమిస్తేగాని కుటుంబ జీవనం సాగుతుంది. తాను పడిన కష్టం తన ఐదుగురు పిల్లలు పడకూడదని కష్ట పడ్డాడు.

లవారిది ఒక సామాన్య రైతు కుటుంబం. ఆరుగాలం శ్రమిస్తేగాని కుటుంబ జీవనం సాగుతుంది. తాను పడిన కష్టం తన ఐదుగురు పిల్లలు పడకూడదని కష్ట పడ్డాడు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఉన్నత చదువులు చదివించాడు. ఆ రైతు పిల్లలు కూడా తమ తల్లిదండ్రుల కష్టం చూసి వారిని కష్టాల సుడిగుండం నుంచి గట్టెక్కించాలనుకున్నారు. తల్లిదండ్రుల కల్ల కలలను సాకారం చేసి వారిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

పూర్తివివరాల్లోకెళ్తే ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామానికి చెందిన కాకుమాను మంగిరెడ్డి, లక్ష్మి దంపతులకు నలుగురు ఆడపిల్లలు, ఒక కొడుకు ఉన్నారు. ఆ రైతు దంపతులు ఇద్దరూ వ్యవసాయ పనులను చేసి పిల్లలను ఉన్నత చదువులు చదివించారు.

దీంతో మంగిరెడ్డి పెద్ద కూతురు నాగమణి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తుంది. రెండో కూతురు జానకి తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించిన పోటీ పరీక్షలకు ఎంతో కష్టపడి చదివి మున్సిపల్‌ శాఖలో శానిటరీ, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్ల పోస్టులను సాధించింది. మూడో కుమార్తె శిరీష ఫార్మ రంగంలో స్థిరపడి అమెరికాకు వెళ్లింది. నాలుగో కూతురు మనోజ, కొడుకు ప్రవీణ్‌ గోపి రెడ్డి బ్యాంకు ఉద్యోగాలు సాధించారు.

ఇక ఆ గ్రామ ప్రజలు రైతు పిల్లలను ఎంతగానో పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. దీంతో రైతుకుటుంబానిక అవధులు లేకుండా పోయాయి. ఇక పోతే తమ తల్లిదండ్రులు కష్టంతోనే తాము ఉన్నతస్థాయికి ఎదిగామని, ఇలాంటి తల్లిదండ్రులుంటే ఎంతటి కష్టాన్నైనా చేధించొచ్చని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories