గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమేనా...?

గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమేనా...?
x
Highlights

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమేనా...? తగినంతా సంఖ్యా బలం లేకున్నా కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలో...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమేనా...? తగినంతా సంఖ్యా బలం లేకున్నా కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలో దింపనుందా..? ఖాళీగా ఉన్న ఒకే సీటుకు నోటిఫికేషన్ రావడంతో టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. దీంతో ఇప్పుడు ప్రతిపక్షాలు ఏం చేయాబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ లో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీ యాదవరెడ్డిపై అనర్హత వేటు పడటంతో ఆ సీటు ఖాళీ అయింది. హైకోర్టులో మండలి ఛైర్మన్ తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆ స్థానంలో ఎన్నికకోసం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 7న నోటిఫికేషన్ రానుండటంతో అంతకు ముందే తమ అభ్యర్థిగా సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును ఖారారు చేశారు గులాబీ బాస్.

అయితే, ఈ నెల 7న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. 26న పోలింగ్ జరుగుతుంది. అదేరోజు సాయంత్రం 5గంటలకు పూర్తి ఫలితాన్ని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ, ఈ ఎన్నిక జరుగుతుందా లేక ఏకగ్రీవం అవుతుందా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఒకవేళ ప్రతిపక్ష కాంగ్రెస్ తమ అభ్యర్థిని బరిలో దించితే ఎన్నిక అనివార్యం అవుతుంది. లేకుంటే ఏకగ్రీవం ఖాయమే.

కాంగ్రెస్ అభ్యర్థి కనుకు పోటీలో ఉంటే గెలిచేందుకు దాదాపు 61 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవసరం ఉంటుంది. ప్రస్తుతం అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌కు 104 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు ఆరుగురు, టీడీపీకి ఇద్దరు, ఎంఐఎంకు ఏడుగురు చొప్పున ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే ఎన్నిక జరిగినా గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎన్నిక లాంఛనమే అవుతుంది. గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం రావడంతో రాష్ట్ర కేబినెట్‌లో చోటు దక్కుతుందన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి జగదీశ్వర్‌రెడ్డి మంత్రిగా కొనసాగుతుండగా.. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో గుత్తాకు అవకాశం ఇస్తే ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారవుతారని పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్.. గుత్తాకు అవకాశం ఇస్తే జగదీశ్వర్‌రెడ్డిని కేబినెట్ నుంచి తప్పిస్తారా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం మీద గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం రావడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చినట్టయ్యింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories