TSPSC: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

TSPSC: ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

నిరుద్యోగ యువత కోసం (టీఎస్పీఎస్సీ) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక శుభవార్తను తెలిపింది.

నిరుద్యోగ యువత కోసం (టీఎస్పీఎస్సీ) తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక శుభవార్తను తెలిపింది.రాష్ట్రంలో ఉన్న వివిధ విభాగాల్లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిగ్రీ, పీజీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆన్ లైన్ దరఖాస్తులను జనవరి 6 నుంచి 25 వరకు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనుంది టీఎస్పీఎస్పీ.

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల వివరాలు : ఖాళీలు

ఖాళీల సంఖ్య మొత్తం : 36

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) : 10

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ : 26

విద్యార్హతలు : అభ్యర్థులు డిగ్రీ (ఫుడ్ టెక్నాలజీ/ డెయిరీ టెక్నాలజీ/ బయోటెక్నాలజీ/ ఆయిల్ టెక్నాలజీ/ అగ్రికల్చరల్ సైన్స్/ వెటర్నరీ సైన్సెస్/ బయో కెమిస్ట్రీ/ మైక్రో బయాలజీ) లలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

పీజీ డిగ్రీ (కెమిస్ట్రీ) , డిగ్రీ (మెడిసిన్)లలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి ‌: 01.07.2019 నాటికి 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి.

01.07.2001 - 02.07.1985 మధ్య జన్మించి ఉండాలి

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం ‌: రాతపరీక్ష (ఆన్‌లైన్/ఓఎంఆర్), సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము : దరఖాస్తు ఫీజు రూ.200, పరీక్ష ఫీజు రూ.80 మొత్తం రూ.280

తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, నిరుద్యోగులకు పరీక్ష ఫీజు చెల్లించనవసరం లేదు.

దీనికి నిరుద్యోగులకు డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.

ఇతర రాష్ట్రాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లించాలి.

పరీక్ష విధానం : రాత పరీక్షలో (పేపర్-1, పేపర్-2) ఉంటాయి.

ఒక్కో పేపర్‌లో 150 మార్కులకు 150 ప్రశ్నలు అడుగుతారు.

పేపర్-1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ నుంచి ప్రశ్నలుంటాయి. పరీక్ష తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో నిర్వహిస్తారు.

పేపర్-2లో అభ్యర్థికి సంబంధించిన విభాగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ పరీక్ష కేవలం ఆంగ్ల మాధ్యమంలోనే నిర్వహిస్తారు.

జీతభత్యాలు : రూ.28,940 - రూ.78,910 వరకు

ముఖ్యమైన తేదీలు...

06.01.2020 : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

25.01.2020 : ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది

హాల్‌టికెట్ డౌన్‌లోడ్ : పరీక్షకు వారంరోజుల ముందుగా.

నోటిఫికేషన్ లింక్..

అధికారిక వెబ్ సైట్ లింక్..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories