ఉంగరం మింగిన ఐదు నెలల బాలుడు

ఉంగరం మింగిన ఐదు నెలల బాలుడు
x
Highlights

చిన్న పిల్లలను చూస్తే చాలు ఏదో ఆనందం కలుగుతుంది. ఎంతటి కష్టాలు వచ్చినా వారి బోసి నవ్వును చూస్తే చాలు మరిచిపోతాము.

చిన్న పిల్లలను చూస్తే చాలు ఏదో ఆనందం కలుగుతుంది. ఎంతటి కష్టాలు వచ్చినా వారి బోసి నవ్వును చూస్తే చాలు మరిచిపోతాము. ఇక ఆ చిన్నారులను తమ తల్లిదండ్రులు అందంగా ముద్దుగా తయారు చేస్తూ ఉంటారు. అందమైన గెటప్ లను వేసి ఫొటోలు తీపిస్తూ ఉంటారు. అంతే కాదు తమ వద్ద ఉన్న నగలతో చిన్నారులను అలంకరించి ముచ్చట పడుతుంటారు. పిల్లలు పెద్ద పెరిగిన తరువాత ఆ చిత్రాలను చూపిస్తూ బాల్యాన్ని గుర్తు చేస్తారు. కానీ ఆభరణాను పిల్లలకు అలంకరించి అజాగ్రత్తగా ఉన్నామో అది ఎంతటి ప్రమాదానికైనా దారితీస్తుంది. ఇదే కోణంలో చిన్నారి వేలును ఉంగరంలో అలంకరించగా పిల్లవాడు ఉంగరాన్ని మింగేసిన ఘటన నిజామాబాద్ లో చోటు చుసుకుంది.

నిజామాబాద్ జిల్లాలో ఐదు నెలల బాలుడికి తల్లిదండ్రులు ఉంగరాన్ని తొడిగారు. దాంతో ఆ చిన్నారి ఆడుకుంటూ తన చేతికి ఉన్న ఉంగరాన్ని మింగేసాడు. అది గొంతులో ఇరుక్కు పోవడంతో ఆ చిన్నారి విలవిలలాడుతూ గుక్క పట్టి ఏడ్వడం మొదులు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలుడ్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెంటనే వైద్యులు ఎక్స్‌రే తీసి గొంతులో ఉంగరం ఇరుకున్నట్టు గుర్తించారు. అనంతరం వైద్యులు చికిత్స ద్వారా బాలుడి గొంతు నుంచి ఉంగరాన్ని తొలగించారు. దీంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఐదు నెలల చిన్నారి యాసిన్ క్షేమంగా ఉన్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories