చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధం

చేప ప్రసాదం పంపిణీకి రంగం సిద్ధం
x
Highlights

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమయింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లుచేసింది. మృగశిర కార్తె సందర్భంగా...

చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమయింది. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లుచేసింది. మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా వ్యాధిగ్రస్థులకు బత్తిని మృగశిర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేప ప్రసాదం అందజేస్తారు. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఎల్లుండి సాయంత్ర ఆరు గంటల వరకు చేప మందు పంపిణీ చేస్తారు.

ఏటా మృగశిర కార్తెనాడు అస్తమా వ్యాధిగ్రస్థులకు హైదరాబాద్ లో బత్తిన సోదరులు చేప ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేస్తారు. ఇందుకోసం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం విస్త్రత ఏర్పాట్లు చేసింది. మత్స్యశాఖ ఆధ్వర్యంలో 1.6 లక్షల కొర్రమీన్లను అందుబాటులో ఉంచారు. చేప ప్రసాద పంపిణీకి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో 36 కౌంటర్లను ఏర్పాటు చేశారు. మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు, ప్రముఖులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. తెలుగు రాష్ర్టాలతోపాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిశాల నుంచి జనం చేప మందు కోసం తరలివస్తున్నారు.

ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆరు వైద్య బృందాలు, మూడు అగ్నిమాపక శకటాలు, ఫైర్ కంట్రోల్ రూంలను అందుబాటులో ఉంచారు. చేప ప్రసాదం పంపిణీకి వచ్చేవారి కోసం హైదరాబాద్‌లోని 14 ట్రాఫిక్ హబ్‌ల నుంచి 150 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. రోగులు, సహాయకుల కోసం రూ.5 భోజన కౌంటర్లతో పాటు వివిధ ట్రస్ట్ లు, సేవాసమితిలు ఉచితంగా టిఫిన్లు, భోజనాలను అందజేస్తాయి.

మృగశిర కార్తె పురష్కరించుకుని శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు ఆస్తమా వ్యాధిగ్రస్థులకు బత్తిని మృగశిర ట్రస్ట్ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదాన్ని స్వీకరించలేనివారు ఆందోళనకు గురికావొద్దని, మరుసటిరోజు హైదరాబాద్‌లోని నాలుగుప్రాంతాల్లో ఉచితంగా ప్రసాదాన్ని అందజేస్తారని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories