ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

ముగిసిన చేప ప్రసాదం పంపిణీ
x
Highlights

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ ముగిసింది. 24 గంటల పాటు సాగిన చేపమందు పంపిణీకి విశేష స్పందన లభించింది. చేప మందు కోసం...

హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేపప్రసాదం పంపిణీ ముగిసింది. 24 గంటల పాటు సాగిన చేపమందు పంపిణీకి విశేష స్పందన లభించింది. చేప మందు కోసం తెలుగు రాష్ట్రాలే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, బిహార్, తదితర రాష్ట్రాల నుంచి ఉబ్బసం వ్యాధి గ్రస్తులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలివచ్చారు. ఈసారి 46కౌంటర్ల ద్వారా సుమారు రెండు లక్షల మందికిపై చేపమందు పంపిణీ చేశారు. మత్స్యశాఖ 1లక్ష 60వేల చేపలను అందుబాటులో ఉంచింది.

గత సంవత్సరం కంటే ఈసారి పెద్ద ఎత్తున చేపమందు పంపిణీ చేసినట్లు బత్తిని సోదరులు వెల్లడించారు. చేప మందు పంపిణీ ముగింపు సందర్బంగా వారు మాట్లాడారు. రేపు ,ఎల్లుండి పలు ప్రాంతాల్లో చేపమందు పంపిణీ చేస్తామని బత్తిని సోదరులు ఈ సందర్బంగా వెల్లడించారు.సోమవారం, మంగళవారం దూద్ బౌలి, కవాడిగూడ, వనస్థలపురం, కూకట్‌పల్లిలో చేపమందు పంపిణీ చేస్తామని చెప్పారు. చేపమందు పంపిణీకి వివిధ స్వచ్ఛంద సంస్థలు తోడ్పాటునందించాయి. అల్పాహారం, భోజనం ఏర్పాటు చేశారు






Show Full Article
Print Article
More On
Next Story
More Stories