తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం

తెలంగాణ పోలీసు శాఖలో తొలి కరోనా మరణం
x
Highlights

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో తొలి కరోనా మరణం నమోదయింది. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ బుధవారం రాత్రి కరోనాతో పోరాడి మృతి చెందాడు.

తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖలో తొలి కరోనా మరణం నమోదయింది. కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న దయాకర్ రెడ్డి అనే కానిస్టేబుల్ బుధవారం రాత్రి కరోనాతో పోరాడి మృతి చెందాడు. ఈ విషయాన్ని డీజీపీ మహేందర్‌ రెడ్డి ట్వీట్‌ చేశారు. దయాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులకు డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని డీజీపీ హామీఇచ్చారు. పూర్తివివరాళ్లోకెళితే నల్గొండ జిల్లాకు చెందిన దయాకర్‌ రెడ్డి హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని జియగూడలో పోలీసు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఉద్యోగ రిత్యా వారంతా ప్రస్తుతం హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్నారు. కాగా కరోనా వైరస్ ని కట్టడి చేసే ప్రయత్నంలో ప్రభుత్వం విధించన లాక్ డౌన్ లో భాగంగా భాగంగా పాతబస్తీలోని ఓ చెక్‌పోస్ట్‌ వద్ద ఆయన విధులు నిర్వర్తించారు. అప్పటి వరకు విధులునిర్వర్తించిన దయాకర్ ఆదివారం తీవ్రజ్వరానికి లోనయ్యారు. అంతే కాకుండా ఒంటి నొప్పులు, జలుబు ఉండడంతో కుటుంబసభ్యులు అతన్ని వెంటనే బేగంపేటలోని నేచర్‌ క్యూర్‌ ఆస్పత్రికి తరలించారు. కాగా అతని కరోనా లక్షణాలు ఉండడంతో వైద్యులు అతని నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఆ పరీక్షల రిపోర్టులు సోమవారం రాగా అందులో అతనికి కరోనా సోకినట్టు గ్రహించారు. దీంతో వైద్యులు దయాకర్‌ను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

మూడు రోజుల పాటు వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. బుధవారం 10.30 గంటల వరకు కరోనాత పోరాడి చివరికి మృతిచెందారు. ఈ విషయాన్ని ఓ సీనియర్‌ పోలీసు అధికారి ధ్రువీకరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దయాకర్‌ కుటుంబ సభ్యులను, అతనితో పనిచేసిన 16 మంది పోలీసుల నుంచి శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. వారిలో నలుగురిని హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించినట్టుగా సమాచారం. ఇక కరోనాతో మృతి చెందిన కానిస్టేబుల్ అంత్యక్రియలను ఐదుగురి సమక్షంలో నిర్వహించారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories