కూకట్‌పల్లి ఎస్‌బీఐలో అగ్ని ప్రమాదం

కూకట్‌పల్లి ఎస్‌బీఐలో అగ్ని ప్రమాదం
x
Highlights

హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగానే సంభవిస్తున్నాయి.

హైదరాబాద్ నగరంలో ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగానే సంభవిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ అపార్ట్మెంట్ వెనక వున్న వలస కూలీల గుడిసెలు దగ్ధమైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే హైదరాబాద్ నగరంలో మరో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకెళ్తే కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో ఉన్న ఎస్‌బీఐ బ్యాంక్‌లో స్వల్పంగా మంటలు చెలరేగినట్లుగా సిబ్బంది వెల్లడించారు.

బ్యాంకులో మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినట్లు వెల్లడించారు. దీంతో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ అగ్నిప్రమాదం ఏసీలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగానే సంభవించినట్లుగా పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ప్రమాదంలో అక్కడ ఉన్నవారికి ఎవరికీ ఎటువంటి హాని జరగలేదని బ్యాంక్ సిబ్బంది తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories