కార్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం..

కార్ షోరూంలో భారీ అగ్ని ప్రమాదం..
x
Representational Images
Highlights

ఓ కార్ల షోరూంలో మంటలు చెలరేగిన సంఘటన శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఓ కార్ల షోరూంలో మంటలు చెలరేగిన సంఘటన శనివారం తెల్లవారుజామున హైదరాబాద్ లోని చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గోల్కొండ చౌరస్తా సమీపంలోని నెక్సా కార్ల సర్వీస్‌ సెంటర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో మొత్తం 7 కార్లు దగ్ధమైనట్టు తలెస్తుంది. కాగా షోరూంలో మంటలు అంటుకోగానే స్థానికలు గుర్తించి ఫైర్ సిబ్బందికి తెలియజేసారు. ఈ సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి 4 ఫైరింజన్లతో చేరుకుని మంటలను అదుపు చేయడానికి ఎంతో కష్టపడ్డారు.

ఇక పోతే మంటలు చెలరేగిన కార్ల షోరూం పక్కనే సీఎన్‌జీ గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ కూడా ఉంది. దీంతో ఈ మంటలు ఎక్కడ ఫిల్లింగ్ స్టేషన్ కు అంటుకుంటాయో అని స్థానికులు, బంకు యజమాని ఆందోళనకు గురయ్యారు. అలా జరిగి ఉంటే భారీ స్ధాయిలో మంటలు చెలరేగి తీవ్ర ఆస్తి నష్టం జరిగేదని స్థానికులు చెపుతున్నారు. కానీ అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

కాగా షోరూంలో ఒక్క సారిగా మంటు ఎందుకు వ్యాపించాయన్న విషయంలో ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్యూట్ వలన ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories