మేడారం జాతరలో మంచినీళ్ల కోసం కొట్లాట

మేడారం జాతరలో మంచినీళ్ల కోసం కొట్లాట
x
మేడారం జాతరలో మంచినీళ్ల కోసం కొట్లాట
Highlights

మేడారం మహాజాతరలో మహిళలు కొట్లాటకు దిగారు. హరిత హోటల్‌ సమీపంలో మంచినీళ్ల కుళాయి దగ్గర ఘర్షణకు దిగారు. నీటికోసం మొదలైన గొడవ కాస్త పెద్దదైంది. చివరకు...

మేడారం మహాజాతరలో మహిళలు కొట్లాటకు దిగారు. హరిత హోటల్‌ సమీపంలో మంచినీళ్ల కుళాయి దగ్గర ఘర్షణకు దిగారు. నీటికోసం మొదలైన గొడవ కాస్త పెద్దదైంది. చివరకు తన్నుకునేవరకు చేరింది. దీంతో ఈ ఘటనలో ఇద్దరికి తలలకు తీవ్రగాయాలయ్యాయి. నేరేడ్‌మెట్‌కు చెందిన యాదగిరికి బలమైన గాయం కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు.

ఆదివాసీ కుంభమేళా మేడారం జాతర ప్రారంభ వేడుకలకు సకల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ రోజు నుంచి ఎనిమిదో తేదీ వరకు సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు మేడారం సకల సౌకర్యాలతో ముస్తాబైంది. వనదేవతల వారంగా భావించే బుధవారం రోజున మేడారం, కన్నెపల్లి, కొండాయి, పూనుగొండ్లలో వనదేవతల పూజా కార్యక్రమాలు నిర్వహించటంతో జాతర మొదలవుతుంది. గిరిజనుల ఆరాధ్యదైవం పగిడిద్దరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలోని యాపలగడ్డ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారానికి సోమవారం బయల్దేరాడు. పగిడిద్దరాజు మూడురోజుల పాటు ప్రయాణించి, మేడారానికి ఈ రోజు రాత్రి 9 గంటల లోపు మేడారం గద్దెలకు చేరుకోవటంతో, జాతర లాంఛనంగా ప్రారంభమవుతుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories