కూతురి అంత్యక్రియలు వీడియో కాల్‌లో చూసి తల్లడిల్లిన తండ్రి..స్థానికులు కంటతడి పెట్టిన వైనం

కూతురి అంత్యక్రియలు వీడియో కాల్‌లో చూసి తల్లడిల్లిన తండ్రి..స్థానికులు కంటతడి పెట్టిన వైనం
x
Highlights

చిన్నప్పటి నుంచి గారంగా పెంచుకున్న కూతురు ఒక్క సారిగా దూరం అయిందంటేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది తన కూతురు చనిపోయినా చివరి చూపుకు నోచుకోకపోవడం అంటే అది ఎంత నరకంగా ఉంటుందో కాదా.

చిన్నప్పటి నుంచి గారంగా పెంచుకున్న కూతురు ఒక్క సారిగా దూరం అయిందంటేనే తల్లిదండ్రులు తట్టుకోలేరు. అలాంటిది తన కూతురు చనిపోయినా చివరి చూపుకు నోచుకోకపోవడం అంటే అది ఎంత నరకంగా ఉంటుందో కాదా.కడుపు తరుక్కు పోయే ఇలాంటి సంఘటన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తివివరాల్లోకెళితే జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌ మండలం తుంగూరు గ్రామానికి చెందిన పాలాజీ భాస్కర్‌ ఐదు నెలల క్రితం బతుకుదెరువు కోసం దుబాయ్ వెల్లాడు.

అక్కడ ఎంతో సంపాదించి ఉన్న అప్పులను తీర్చి కుటుంబాన్ని సంతోషంగా చూసుకుందాం అనుకుని భార్య సునీత, కుమార్తె సాహిత్య (12)లను సొంత ఊరిలోనే వదిలి వెల్లాడు. అతను వెల్లిన కొద్ది రోజుల నుంచి తన కూతురు సాహిత్య డయాబెటిస్‌తో బాధపడుతోంది. కాగా ఆమె తల్లి తన వద్ద ఉన్న డబ్బులతో వైద్యం చేయిస్తూ ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదరుకొంది. కన్న కూతురి ఆరోగ్యం కల్ల ముందు చెడిపోతుంటే తట్టుకోలేక తెలిసిన వారి దగ్గర అప్పులు కూడా చేశారు.

అంత చేసినా ఫలితం మాత్రం దక్కలేదు. ఆరోగ్యం పూర్తిగా చెడిపోవడంతో పరిస్థితి విషమించి చిన్నారి సాహిత్య శుక్రవారం మృతి చెందింది. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు దుబాయ్ లో ఉన్న తండ్రి భాస్కర్ కు చిన్నారి మృతి సంగతి కబురు చేసారు. కానీ ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ సందర్భంగా విమానాలు ఏవీ నడవకపోవడంతో కన్న కూతురిని చివరి చూపు చూసుకోవడానికి రాలేక పోయాడు. ఆ తండ్రి గుండె ఎంతగానో తల్లడిల్లిపోయినా తన కూతురిని గుండెలకు హత్తుకోలేక పోయాడు.

చివరికి చేసేది ఏం లేక వీడియా కాల్ ద్వారా ప్రతి రోజూ తన కూతురిని పలకరించే అతను ఆమె అంత్యక్రియలను కూడా అదే వీడియో కాల్ ద్వారానే చూసాడు. వీడియోకాల్ చూస్తూనే శ్మశానానికి సాగనంపాడు. ఈ విషయం తెలిసి స్థానికులు సైతం కంట తడి పెట్టారు. ఏ తండ్రికీ ఇలాంటి కష్టం రావొద్దని వారు కోరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న ఈ కరోనా కారణంగా మనిషిక మనిషికి మధ్య సంబంధాలు తెగిపోతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories