నీ మనసెంత మంచిదో నాన్న..

నీ మనసెంత మంచిదో నాన్న..
x
కూతురిని పరీక్ష హాలుకు తీసుకువచ్చిన తండ్రి
Highlights

ఆడపిల్ల అంటేనే సమాజంలో చాలా మంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. తన ఇంట్లో ఉన్న తల్లి, అక్క, చెల్లి, ఆలి ఆడవారే అయినప్పటికీ ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఖర్చకు...

ఆడపిల్ల అంటేనే సమాజంలో చాలా మంది చిన్న చూపు చూస్తూ ఉంటారు. తన ఇంట్లో ఉన్న తల్లి, అక్క, చెల్లి, ఆలి ఆడవారే అయినప్పటికీ ఆడపిల్ల పుట్టిందంటే చాలు ఖర్చకు చేటు అనుకుంటుంటారు. అంతే కాదు కడుపులో పెరుగుతుంది ఆడపిల్ల అని తెలియగానే భౄణహత్యలు చేసు వారు కొంత మంది అయితే, పురిట్లోనే చంపేసేవారు, రోడ్డు పై వదిలేసే వారు కొంత మంది. దీంతో రోజు రోజుకు ఆడపిల్లల సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఆరోగ్యంగా ఉన్న ఆడపిల్లల పిరస్థితే అలా ఉంటే మరి అంగవైకల్యం ఉన్న వారి పరిస్థితి ఏమిటి.

ఇలాంటి సమాజంలో కూడా ఓ తండ్రి తన కూతునికి నేనున్నానని ధైర్యం చెబుతున్నారు. తన చదువు కోసం ఎంతో కష్టపడుతున్నారు. అంగవైకల్యం ఉన్న తన కూతురును స్వయంగా తండ్రే పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చి పరీక్ష రాయించాడు. తనకు ఎలాంటి భయం లేదంటూ ధైర్యం చెప్పాడు.

పూర్తివివరాల్లోకెళితే బావురావు మందుల్వార్‌ అనే వ్యక్తి ఆదిలాబాద్ పట్టణంలోని కోలిపుర కాలనీలో జీవనం సాగిస్తున్నారు. ఆయనకు వికిత అనే అంగవైకల్యం ఉన్న కూతురు ఉంది. అయితే వికితకు అందరి లాగే చదువుకుని ఏదో సాధించాలనే ఆశ ఉంది. దీంతో బావురావు తన కూతిరి కళను నెరవేర్చడం కోసం చదువు చెప్పిస్తున్నాడు. ఆమె బంగారు భవిష్యత్తు కోసం ఆమెను ఓపెన్‌లో డిగ్రీ చదివిస్తున్నాడు. కాగా ఓపెన్ డిగ్రీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె పరీక్ష సెంటర్ ప్రభుత్వ డిగ్రీ బాలుర కళాశాలలో పడింది. దీంతో నడవలేని పరిస్థితిలో ఉన్న ఆమెను బావురావు పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చాడు. అన్ని వేలల నీకు తోడుగా నాన్న ఉన్నాడమ్మా అంటూ ధైర్యాన్నిచ్చాడు. దగ్గరుండి ఆమెను ప్రోత్సహించాడు. కాగా వికితకు అంగవైకల్యం కారణంగా రాయడానికి కూడా రాకపోవడంతో సహాయంగా పదవ తరగతి విద్యార్థి పరీక్ష రాశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories