Siddipet: కేక్ తిని చనిపోయిన తండ్రీకొడుకులు

Siddipet: కేక్ తిని చనిపోయిన తండ్రీకొడుకులు
x
Highlights

సిద్దిపేట జిల్లా ఐనపూర్ గ్రామంలో 4 నెలల క్రితం జరిగిన దుర్ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా ఐనపూర్ గ్రామంలో 4 నెలల క్రితం జరిగిన దుర్ఘటనలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విషం కలిపిన బర్త్‌డే కేక్ తిని తండ్రీకొడుకులు మృతి చెందిన సంఘటనలో పోలీసులు పలు ఆధారాలు సేకరించారు.తాజాగా కేకు తయారు చేసిన బేకరీ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కేక్‌లో వాడే పదార్ధాలు విషపూరితమై ఫంగస్‌ ఉత్పత్తి అయిన చనిపోవడానికి కారణమైన న్యూ ఇండియా బేకరీ యజమాని హఫీజ్‌పై కేసు నమోదు చేశారు.

సిద్దిపేట జిల్లా ఐనపూర్ గ్రామములో గత ఏడాది సెప్టెంబర్ 4 న ఇస్తారి గళ్ళ, రవి కుమారుడు రాంచరణ్ బర్త్ డే కోసం బాబాయ్ అయిన శ్రీనివాస్ ఆ రోజు రాత్రి సిద్దిపేట నుండి ఆర్.టీ. సి బస్సు లో కేక్ పంపినాడు. కేక్ వచ్చేసరికి రాత్రి 11 గంటల సమయం బర్త్ డే కేక్ కోసి తండ్రి కొడుకులు తిన్నారు. తిన్న తరువాత అస్వస్థతకు గురయ్యారు. రాత్రి 2 గంటల సమయం లో తండ్రి కొడుకులను సిద్దిపేట దవాఖానకు తరలించారు చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

బిడ్డ భార్య కేక్ తక్కువగా తినడంతో వాళ్ళు ప్రాణాపాయము నుండి తప్పించుకున్నారు. అన్నదమ్ముళ్లకు ఇద్దరికి గొడవలు జరుగుతున్నాయి. తమ్ముడే అన్నను చంపడానికి కేక్ లో విషం కలిపారు అని అనుకున్నారు. పోలీసులు కూడా నిందితుడు శ్రీనివాస ను అదుపులోకి తీసుకున్నారు. విషం కలిపిన కేక్ ను ఫోరెకుల్యాబ్ కు పంపినారు ల్యాబ్ పరీక్షల అనంతరం కేక్ లో ఎలాంటి విష ప్రయోగం జరగలేదని కాలపరిమితి దాటిన పదార్థాలు రసాయనాలు వారు ఎలాంటి శుబ్రతా పాంటించకుంటా అపరి శుభ్ర వాతావరణం లో తయారు చేశారు.

కానీ 4 నెలల తర్వాత పోలీసులు మాత్రం కేక్ తయారు చేసిన బేకరి యజమానిని అదుపులోకి తీసుకున్నారు. ఆ కేక్ లో వాడే పదార్థాలను జాగ్రత్తలు శుబ్రతా పాటించ కుండా కేక్ తయారిలో వాడే పదార్థాలు విషపూరితమై పంగసు విష పదార్థం ఉత్పత్తి అయి వారు చనిపోవుటకు కారణమని సిద్దిపేట లోని న్యూ ఇండియా బేకరీ యజమాని ఎమ్.డి. హఫీజ్ పై కేస్ నమోదు చేసి ఈ రోజు అరెస్టు చేసి రేమండ్ కు పంపినారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories