కందులు కొనాలని అధికారుల కాళ్లు మొక్కిన రైతులు

కందులు కొనాలని అధికారుల కాళ్లు మొక్కిన రైతులు
x
Highlights

అందరికీ అన్నం పెట్టే రైతన్నలు తమ కష్టాలు తీర్చాలంటూ, తాము పండించిన పంటను కొనుగోలు చేయాలంటూ అదికారులను బతిమిలాడుతున్నారు.

అందరికీ అన్నం పెట్టే రైతన్నలు తమ కష్టాలు తీర్చాలంటూ, తాము పండించిన పంటను కొనుగోలు చేయాలంటూ అదికారులను బతిమిలాడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతుధరను ఇవ్వాలని వేడుకుంటున్నారు. అయినా అధికారులు చలించకపోవడంతో ఏకంగా వారి కాళ్లను మొక్కుతున్నారు. అయిన్పటికీ అధికారులు పట్టించుకోక పోవడంతో వారు దళారులతో కలిసి దందా నిర్వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

పూర్తివిరాల్లోకెలితే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ రైతులు తాము పండించిన కందిపంటను అమ్మడానికి మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. ఎంతసేపు గడిచినా కొనుగోలు దారులు, అదికారులు స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే ఇన్‌చార్జికి, రైతులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అయినప్పటికీ కొనుగోలుదారులు స్పందించకపోవడంతో తాము తెచ్చిన కందులను కొనుగోలు చేయమని కొనుగోలు కేంద్రం ఇన్‌చార్జి నర్సింహారెడ్డి కాళ్లు మొక్కారు.

అనంతరం తమ కందులను కొనుగోలు చేయాలని వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఎదుట పాత జాతీయ రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. అధికారులు ఈ సమాచారం పోలీసులకు ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులను సముదాయించి ధర్నాను విరమింపజేశారు. అనంతరం ఈ ఘటనపై విచారణ చేపడతామని ఐపీఎస్‌ అధికారిణి రితిరాజ్‌ రైతులకు హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories