న్యాయం చేయాలంటూ ఎమ్మార్వో కాళ్లపై పడిన రైతులు

న్యాయం చేయాలంటూ ఎమ్మార్వో కాళ్లపై పడిన రైతులు
x
Highlights

తెలంగాణ రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతునే ఉన్నాయి. రోజు ఎక్కడో ఒకదగ్గర రెవెన్యూ అధిరాలు సామాన్యులను ఇబ్బందులకు పెడుతూనే ఉన్నారు.

తెలంగాణ రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతునే ఉన్నాయి. రోజు ఎక్కడో ఒకదగ్గర రెవెన్యూ అధికారులు సామాన్యులను ఇబ్బందులకు పెడుతూనే ఉన్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాల కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన ఓ రైతు భూమిని రెవెన్యూ అధికారులు రికార్డుల్లో వేరే వ్యక్తి పేరును నమోదు చేశారు. తమ భూమిని తిరిగి తమ పేరిట నమోదు చేయాలని ఎమ్మార్వో కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. వీఆర్వో, ఎమ్మార్వోలను ఎంత వేడుకున్న కనికరించడం లేదు. దీంతో విసుగు చెందిన రైతులు కార్యాలయానికి వచ్చి తహశీల్దార్ కాళ్లపై పడి, తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. తమకు ఇప్పటికైనా పాస్ పుస్తకం ఇప్పించాలని వేడుకున్నారు. తమ కష్టాలు చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.తమకు న్యాయం చేయకపోతే నేను బతకలేను సార్ అంటూ కన్నీరు పెట్టుకున్నారు. దీనికి సంబంధిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెవెన్యూ అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories