Top
logo

పొలాల్లో అరెస్టుల అలజడి

పొలాల్లో అరెస్టుల అలజడి
Highlights

తమ పొలం కోసం మరోసారి రైతులు నెత్తురు చిందించారు. భూముల్లో సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులను అడ్డుకునేందుకు...

తమ పొలం కోసం మరోసారి రైతులు నెత్తురు చిందించారు. భూముల్లో సర్వే చేపట్టేందుకు వచ్చిన అధికారులను అడ్డుకునేందుకు ప్రాణాలను బలిపెట్టారు. అయినా ఆ రైతులు ఓడిపోయారు. సర్వేలు వద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం కుడికిళ్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కాల్వల కోసం సర్వే చేసేందుకు అధికారులు రావడంతో రైతులు ఆందోళన చేపట్టారు. పదుల సంఖ్యలో చేరుకున్న అన్నదాతలు సర్వేలు వద్దంటూ నినాదాలు చేశారు. తమ భూమిలో తామే వ్యవసాయం చేసుకుంటామని కాళ్లా వేళ్లా పడ్డారు. అయినా ఆ అధికారులు పట్టువీడలేదు.

ఇటు రంగంలోకి దిగిన పోలీసులు రైతుల ఆందోళనలను అడ్డుకున్నారు. వారిని అరెస్ట్‌ చేశారు. కొందరు రైతులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వారిని బలవంతంగా, ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో ఓ రైతు రాయితో తలపై కొట్టుకోవడంతో తీవ్రరక్తస్రావం అయ్యింది. దీంతో అతడిని కొల్లాపూర్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story

లైవ్ టీవి


Share it