ఓ రైతు వినూత్నఆలోచన.. పబ్లిక్ ఫీదా

ఓ రైతు వినూత్నఆలోచన.. పబ్లిక్ ఫీదా
x
Highlights

ఒక బైక్‌పై ఏడుగురు ప్రయాణం సాధ్యమా..? అదే బైక్ పై క్వింటాళ్ల కొద్ది ఎరువుల బస్తాలు తీసుకెళ్లడం కుదురుతుందా..? కానీ రైతు దీనిని నిజం చేశాడు.. అతడి...

ఒక బైక్‌పై ఏడుగురు ప్రయాణం సాధ్యమా..? అదే బైక్ పై క్వింటాళ్ల కొద్ది ఎరువుల బస్తాలు తీసుకెళ్లడం కుదురుతుందా..? కానీ రైతు దీనిని నిజం చేశాడు.. అతడి వ్యవసాయ అవసరాల కోసం ఓ వినూత్న ఆలోచన అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు.. ఇంతకీ ఆరైతు తయారు చేసిందేంటి..? అని తెలుసుకోవాలంటే నిజామాబాద్ వెళ్లాల్సిందే.

ఇక్కడ చూడండి ఓ ట్రాలీలో 7 మంది కూలీలు కూర్చొని ఎలా వెళ్తున్నారో దీనిలో ఏముంది వింత అనుకుంటున్నారా..? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్ ఇది ట్రాక్టర్ కాదు.. ఓ బైక్ ట్రాలీ బైక్ నడుపుతున్న వ్యక్తి పేరు భాస్కర్ రెడ్డి ఇతనిది నిజామాబాద్ జిల్లా రెంజల్ భాస్కర్ రెడ్డికి ట్రాక్టర్ కొనే ఆర్థిక స్తోమత లేదు.. తన పొలానికి నిత్యం కూలీలను ఆటోలో తీసుకెళ్లడం, తీసుకురావడం భారంగా మారింది. దీంతో ఇతగాడికి ఓ ఐడియా తట్టింది అందులోంచి పుట్టిందే మినీ ట్రాలీ.. 20వేల ఖర్చుతో బైక్ ను ట్రాక్టర్ గా మార్చాడు భాస్కర్ రెడ్డి. ఈ బైక్ ట్రాలీలో కేవలం కూలీలనే కాదు, ఎరువుల బస్తాలనూ తరలిస్తున్నాడు భాస్కర్ రెడ్డి.

ఈ ట్రాలీ బైక్ చూసేందుకు జిల్లా నలుమూలల నుంచి రైతులు తరలొచ్చి భాస్కర్ రెడ్డి తయారు చేసిన మినీ ట్రాలీని చూసి ఓ ట్రిప్పు వేసి పోతున్నారు. ఐదు క్వింటాళ్ల బరువును మోసేలా తయారు చేసిన ఈ మినీ ట్రాలీ ఒకేసారి 6 నుంచి 8మంది కూలీలను తీసుకెళ్తుంది. ఒకప్పుడు కూలీలను తరలించేందుకు 300 వరకూ ఖర్చు అయ్యేదని.. ఇప్పుడు అర లీటకరు పెట్రోల్ తో పనైపోతుందని చెబుతున్నాడు.

భాస్కర్ రెడ్డి తయారు చేసిన ట్రాలీ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ బైక్ ట్రాలీతో డబ్బుతో పాటు సమయం ఆదా అవుతుందని రైతులు అంటున్నారు.. తమ బైకులను కూడా మినీ ట్రాలీలు బిగించుకునేందుకు రెడీ అవుతున్నారు. ప్రభుత్వం సబ్సిడీపై ట్రాలీలు అందిస్తే ఎంతో ఉపయోగం ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి ట్రాక్టర్ కొనే ఆర్ధిక సామర్థ్యం లేని చిన్న రైతులకు భాస్కర్ రెడ్డి ఆలోచన ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది ట్రాక్టర్ లేని లోటును ట్రాలీ తీరుస్తుండటంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories