జనగామ జిల్లాలో కులబహిష్కరణ... కులాంతర వివాహం చేసుకుందని...

జనగామ జిల్లాలో కులబహిష్కరణ... కులాంతర వివాహం చేసుకుందని...
x
Highlights

పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి కుటుంబాన్ని ... కుల బహిష్కరణ చేసిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. తరిగొప్పుల మండలం బొంతగట్టుకు...

పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి కుటుంబాన్ని ... కుల బహిష్కరణ చేసిన ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది. తరిగొప్పుల మండలం బొంతగట్టుకు చెందిన యువతి వరంగల్ కు చెందిన అనీల్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు కూడా ఒప్పుకోవడంతో మూడు నెలల క్రితం వివాహం చేసుకుంది. అయితే తమ కులం కాని అబ్బాయిని పెళ్లి చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామ సర్పంచ్ భర్త .. యువతి కుటుంబానికి లక్ష రూపాయల జరిమానా విధించడంతో పాటు కుల బహిష్కరణ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమయంలో పెళ్లికి హాజరైన బంధువులకు కూడా 50 వేల రూపాయల జరిమానా విధించాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories