మృతదేహాల కోసం ఎదురు చూపులు..

మృతదేహాల కోసం ఎదురు చూపులు..
x
డీఎస్పీ, సీఐలకు సూచనలిస్తున్న వనపర్తి ఎస్పీ అపూర్వరావు
Highlights

దిశ హత్య కేసులో నిందుతులను నిన్న ఉదయం చెటాన్ పల్లిలో ఎన్ కౌంటర్ చేసిన సంఘటన అందరికీ తెలిసిందే.

దిశ హత్య కేసులో నిందుతులను నిన్న ఉదయం చెటాన్ పల్లిలో ఎన్ కౌంటర్ చేసిన సంఘటన అందరికీ తెలిసిందే. ఇదిలా ఉంటే వారి మృత దేహాలు ఈ రోజు వారి స్వగ్రామానికి చేరుకోలవసింది. వారి మృత దేహాలు శనివారం గ్రామాలకు చేరుకోకపోవడంతో అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. జాతీయ మానవహక్కుల కమిషన్, హైకోర్టు లో ఇచ్కిన ఆదేశాలతో మృతదేహాలను ఆస్పత్రిలోనే భద్రపరిచారు.

కానీ మృత దేహాలను భద్రపరచడానికి జిల్లా ఆస్పత్రిలో ఫ్రీజర్‌లు లేకపోవడంతో బయటి నుంచి తెప్పించి మృతదేహాలను అందులో భద్రపరిచారు. వారి మృత దేహాలకు శుక్రవారం రాత్రి డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, 15మంది కానిస్టేబుళ్లతో బందోబస్తు నిర్వహించారు.

ఇదిలా ఉంటే నిందితుల కుటుంబాలు శోకంలో మునిగిపోయాయి. వారి మృత దేహాలు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తున్నారు. వారి అంత్యక్రియల కోసం చేయవలసిన ఏర్పాట్లను పూర్తిచేశారు. నవీన్, శివ, చెన్నకేశవుల కుటుంబీకులు వారి కుటుంబ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేసేందుకు గ్రామ శివారులోని శ్మశాన వాటికలో గుంతలను తవ్వించారు. ఇక పాషాను కుటుంబం వారి ముస్లిం సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి ఎదురుచూస్తు్న్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories