30 మంది తెలుగు విద్యార్థులను విడుదల చేసిన అమెరికా

30 మంది తెలుగు విద్యార్థులను విడుదల చేసిన అమెరికా
x
Highlights

ఫేక్‌ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగురాష్ట్రాలకు చెందిన విద్యార్థులలో 30 మందికి విముక్తి లభించింది. అమెరికా ప్రభుత్వం వారిని విడుదల చేసింది....

ఫేక్‌ యూనివర్సిటీ వ్యవహారంలో అరెస్టయిన తెలుగురాష్ట్రాలకు చెందిన విద్యార్థులలో 30 మందికి విముక్తి లభించింది. అమెరికా ప్రభుత్వం వారిని విడుదల చేసింది. దీంతో వారు ఆదివారం అమెరికానుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ విషయాన్ని అమెరికా తెలుగు సంఘాల నాయకుడు నవీన్‌ జలగం మీడియాకు తెలిపారు. తన ఫేస్‌ బుక్‌ ఐడీకి స్టూడెంట్స్‌ వివరాలు పంపమని ఆయన కోరారు. నకిలీ వీసాల కేసులో అమాయక విద్యార్ధులు ఇరుక్కుపోయారని..

అమెరికా జైళ్లనుంచి విద్యార్ధులను విడుదల చేయించేందుకు అమెరికాలో ఉన్న తెలుగు సంఘాలు కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ విషయంలో విద్యార్ధుల తల్లిదండ్రులు కంగారుపడాల్సిన అవసరం లేదని, త్వరలోనే మిగిలిన విద్యార్ధులు ఇండియాకు చేరకుంటారని ఆయన దైర్యం చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories