సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న అసత్య ప్రచారాలు ఇవే...

సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతున్న అసత్య ప్రచారాలు ఇవే...
x
Representational Image
Highlights

ప్రస్తుత కాలంలో చదువుకోని వారి కంటే, చదవుకున్న వారితోనే సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయని చెప్పవచ్చు.

ప్రస్తుత కాలంలో చదువుకోని వారి కంటే, చదవుకున్న వారితోనే సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయని చెప్పవచ్చు. అది కూడా ఎక్కువడా ఎవరైతే సోషల్ మీడియాను వాడుతున్నారో వారి ద్వారా అధికంగా సమస్యలు ఎదురవుతున్నాయి. అలాంటి వారి ఎక్కువగా అసత్యాలు ప్రచారంలోకి వస్తున్నాయి. వారందరూ సోషల్‌ మీడియా వేదికగా చేసుకోని వారికి తోచిన ఊహాగానాలను, అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారు. వాట్సాప్‌, ఫేస్‌బుక్‌లో చెత్తా చెదారాన్ని షేర్‌ చేస్తూ ప్రజలకు తప్పు దోవ పట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలో వ్యాపిస్తున్నకరోనా గురించి ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రచారం చేస్తున్నారు.

ఒక వైపున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్లో వైరస్ పై అవగాహన కల్పించేందుకు ఎన్నో జాగ్రత్త చర్యలు తీసుకుంటుంది. మరో వైపు కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో వైరస్ గురించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీస్ డిపార్ట్ మెంట్లు ఎన్ని సార్లు ఇలాంటి ప్రచారం చేయొద్దని వారింనా కొంత మంది మాత్రం దాన్ని మానుకోవడం లేదు. ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తి చేస్తే ఇప్పుడున్న చట్టాల ప్రకారం కనీసం ఒక సంవత్సరం జైలుశిక్ష పడుతుందని అధికారులు తెలుపుతున్నారు.

ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూకు పిలుపునిచ్చారు. ప్రజలెవరూ ఇండ్ల నుంచి రావొద్దని ఆదేశాలు జారీ చేసారు. ఇక ఈ విషయాన్ని కొంత మంది ఆసరాగా చేసుకుని సోషల్ మీడియాలో ఎన్నో అవాస్తవాలను పోస్ట్ చేసారు. హెలికాప్టర్లు, విమానాల నుంచి రసాయనాలు చల్లుతున్నరని దీని ద్వారా వైరస్ చనిపోతుందని, అందుకే ప్రజలెవరూ బయటకు రాకుండా స్వచ్చందంగా నిర్భంధంలో ఉండాలంటున్నారని ప్రచారం చేశారు. ఈ విషయం దేశమంతటా హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు ఇలాంటి ఎన్నో తప్పుడు విషయాలను కొంత మంది నెటిజన్లు పోస్ట్ చేసారు. కొంత మంది రష్యాలో రోడ్లపైన సింహాలను వదిలారని ప్రచారం చేసారు. కానీ అది ముమ్మాటికి అసత్యం అని అక్కడి ప్రభుత్వాలు స్పష్టం చేసాయి.

రెండవ విషయం హెలికాప్టర్ల ద్వారా క్రిమిసంహారక మందులు స్ప్రే చేస్తున్నారని తెలిపారు. అది కూడా అసత్య ప్రచారమే. ఇక మూడో విషయం కరోనా వైరస్‌ భారత్‌ నుండి వెనక్కి వెళ్లిపోయిందని నాసా శాస్త్రవేత్తలు చెప్పారని ప్రచారం చేసారు. అది కూడా అత్యప్రచారాలే అని తేల్చారు ప్రభుత్వాలు. నాలుగొ విషయం ప్రధాని మోదీ రూ.400 టాక్‌టైం ఉచితంగా ఇస్తున్నారని కొంత మంది ప్రచారం చేసారు. అద కూడా అసత్య ప్రచారమే. ఇక ఐదో ముఖ్యమైన విషయం ఏంటంటే కరోనా వైరస్‌కు వాక్సిన్‌ వచ్చేసింది అని ప్రచారం చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ ఏ దేశంలోనూ వైరస్ కు వాక్సిన్ ఇంకా లభ్యం కాలేదు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories