logo

మీటర్ రీడింగ్‌లలో మతలబు

మీటర్ రీడింగ్‌లలో మతలబు
Highlights

ఆలస్యంగా మీటర్ రీడింగ్ మారుతున్న స్లాబ్ పెరుగుతున్న బిల్లులు దుష్ప్రచారమంటున్న విద్యుత్ ఉద్యోగులు

విద్యుత్ శాఖ లీలలు అంతా ఇంతా కాదు మీటర్ రీడింగ్‌లలో మతలబు వినియోగదారుల జేబులు గుల్ల చేస్తున్నాయి. సకాలంలో మీటర్ రీడింగ్ చేయకపోవడంతో బిల్లులు తడసిమోపెడవుతున్నాయని గగ్గోలు పెడుతున్నారు. వినియోగదారుల ఆరోపణలు అవాస్తమంటున్నారు విద్యుత్ ఉద్యోగులు.

విద్యుత్ శాఖ ఉద్యోగుల నిర్లక్ష్యం వినియోగదారుల పాలిట శాపంగా మారింది. ప్రతి నెల 30 రోజులకు బిల్ తీయాలి. కానీ 30 రోజుల తర్వాత 31 రోజు నుంచి 40 రోజుల వరకు బిల్లులు తీస్తున్నారు. దీంతో స్లాబ్‌లు మారి రెట్టింపు బిల్లులు వస్తున్నాయి. వంద యూనిట్స్ స్లాబ్ వరకు యూనిట్‌కు 3రూపాయల 60పైసలుగా సర్కార్ నిర్ణయించింది.

విద్యుత్ రీడింగ్‌ రెండు రోజులు ఆలస్యంగా తీయడం వల్ల 106 యూనిట్లతో బిల్లు వస్తుంది. అయితే 101 యూనిట్లు దాటితే యూనిట్ ధర 6రూపాయల 90 పైసలు అవుతుంది. వంద యూనిట్లకు 390 రూపాయలు కట్టాల్సి ఉండగా 101 యూనిట్లకు 690 రూపాయలు కట్టాల్సి వస్తోంది. బిల్లింగ్ లేట్‌గా తీసి అదనంగా డబ్బులు కట్టేలా చేస్తున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వినియోగదారుల వాదన ఇలా ఉంటే విద్యుత్ శాఖ వాదన మరోలా ఉంది. అసలు విషయాలు పక్కన పెట్టి తమ శాఖపై కొందరు పనిగట్టుకుని దుష్ ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు. సరిగ్గా ప్రతి ఒక్కరికి 30రోజుల వ్యవధిలో బిల్లు ఇవ్వడం సాధ్యంకాదంటున్నారు. ఎక్కువ రోజుల తర్వాత బిల్లు తీస్తున్నా రూపొందించిన సాఫ్ట్‌వేర్ ఆధారంగా 30రోజులకే బిల్లు లెక్కిస్తుందని చెబుతున్నారు.


లైవ్ టీవి


Share it
Top