ఖమ్మం జిల్లాలో భారీగా దొంగనోట్ల స్వాధీనం

ఖమ్మం జిల్లాలో భారీగా దొంగనోట్ల స్వాధీనం
x
Highlights

ఖమ్మం జిల్లాలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. సత్తపల్లి కేంద్రంగా నకిలీనోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....

ఖమ్మం జిల్లాలో దొంగనోట్ల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. సత్తపల్లి కేంద్రంగా నకిలీనోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఏడు కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. రద్దయిన నోట్లకు బదులు కొత్త నోట్లు ఇస్తామంటూ బురిడీకొట్టిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

వేంసూర్ మండలం మర్లపాడులో పోలీసులు ఆకస్మికంగా ఓ ఇంటిపై దాడి చేసి దాచి ఉంచిన నకిలీ నోట్లు చలామణిలో లేని ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల కట్టలు గుర్తించారు. సత్తుపల్లి మండలం రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మధార్ అనే వ్యక్తి ఆ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మధార్ తో పాటు అతని భార్య, కొడుకు సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి స్వాధీనం చేసుకున్న 7 కోట్ల రూపాయాల నకిలీ కరెన్సీని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories