ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌.. సైబర్ పోలీసుల చేతికి చిక్కిన 25 మంది

ఫ్యాక్ట్ చెక్ వెబ్‌సైట్‌.. సైబర్ పోలీసుల చేతికి చిక్కిన 25 మంది
x
Representational Image
Highlights

దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏదైనా సంఘటన జరిగిందంటే చాలు. దానిపై ఎన్నో వార్తలు, వదంతులు వస్తుంటాయి.

దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఏదైనా సంఘటన జరిగిందంటే చాలు. దానిపై ఎన్నో వార్తలు, వదంతులు వస్తుంటాయి. అందులో కొన్ని నిజాల, కొన్ని అబద్దాలు ఉంటాయి. దీంతో చాలా మంది ఫేక్ వార్తలు నిజం అని నమ్మేస్తుంటారు. మరికొంత మంది ఫేక్ న్యూస్ వినీ వినీ నిజమైన వార్త వచ్చినా నమ్మకుండా కొట్టిపారేస్తుంటారు. దీంతో ప్రజలు ఏది నమ్మాలో, ఏది నమ్మొద్దో అయోమయంలో పడిపోతుంటారు.అయితే ప్రస్తుతం ప్రజలు అలాంటి అయోమయంలోనే ఉంది. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నో వార్తలు వస్తున్నాయి. వాటితో కొన్ని నిజమైన వార్తలు ఉంటే, కొన్నిపుకార్లు ఉన్నాయి. అవి ఎక్కువగా హల్ చల్ చేస్తున్నాయి. ఆ వార్తలను చూసిన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

ప్రభుత్వం, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలాంటి ప్రచారాలు చేయకూడదని చెప్పినప్పటికీ కొంత మంది ఇలాంటి వార్తలను పోస్ట్ చేస్తూనే ఉన్నారు. అయితే ఇలాంటి నకిలీ వార్తలకు చెక్‌ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకమైన చొరవ చూపింది. నకిలీ వార్తలను తెలుసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఓ వైబ్ సైట్‌ ను రూపొందించింది. ఈ వెబ్ సైట్ ద్వారా నిజమైన వార్తలను, ఫేక్ వార్తలను తెలుసుకోవచ్చు. ఈ యాప్ ని నిజానిజాలు ధ్రువీకరించే ఫ్యాక్ట్‌లీ మీడియా అండ్‌ రీసెర్చి అనే వెబ్ సైట్‌తో రూపొందించారు. factcheck.telangana.gov.in ద్వారా ప్రజలు ఏది నిజమైన వార్తో, ఏది నకిలీ వార్తో అనే నిజాలు తెలుసుకుంటున్నారు. అసత్య ప్రచారంతో ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ యాప్ ప్రారంభం అయి సుమారుగా వారం రోజులు అవుతుంది. అయినా అతి తక్కువ సమయంలోనే ఈ యాప్ ద్వారా తెలంగాణ సైబర్ పోలీసులు ఇప్పటివరకు 20 తప్పుడు అంశాలను గుర్తించి వివరణలు జత చేశారు. వైరల్ అవుతున్న వీడియోలు, ఫోటోలు, వార్తలను విశ్లేషించి వాస్తవాన్ని ప్రజల ముందు పెడుతున్నారు. ఇప్పటి వరకు వైరస్ గురించి డాక్టర్లు, పోలీసు అధికారుల పేర్లతో తప్పుడు సమాచారం పోస్టు చేసిన 25 మందిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ వీడియోలు, ఫోటోలు పోస్ట్ చేస్తున్నవారు పోలీసులకు పట్టుబడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడి నుంచి పాత పోటోలు, వీడియోలను సేకరించి వాటిని మార్పింగ్, ఎడిట్‌ చేసి కొత్త వీడియోలుగా పోస్ట్ చేస్తున్నారు. ఇక ఆ వీడియోలను చూసిన ప్రజలు ఆ వీడియోలు, ఫోటోలు నిజమేనేమో అని భయాందోళనకు గురవుతున్నారు.

ఇక ఈ యాప్ అందుబాటులోకి తీసుకురావడంతో అధికారులు ఒక వార్త నిజమా అబద్దమో తెలుసుకోవడానికి 6 గంటలకు పైగా సమయం పడుతోంది.ఇక ఈ మధ్య కాలంలో వైరల్ అయిన వీడియోలను చూసుకుంటే పోలీసులపై కరోనా రోగి ఉమ్మేశాడంటూ ఇటీవల ఓ వీడియో వైరల్ అవుతోంది. అది అబద్దమని పోలీసులు తేల్చేసారు. లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో ప్రజలు రోడ్లపై తిరుగుతుండడంతో రాష్యాప్రభుత్వం రోడ్లపై సింహాలను వదిలారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కానీ ఇది ఫేక్ వార్త అని పోలీసులు తేల్చి చెప్పారు. ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయి. ఈ వీడియోలను చూసిన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వీడియోలను చూసి ఎవరూ భయపడకూడదని పోలీసులు ప్రజలను కోరుతున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories