హైదరాబాద్ నగరంలో నయా ట్రెండ్‌

హైదరాబాద్ నగరంలో నయా ట్రెండ్‌
x
Highlights

సొంతింటి కల నెరవేర్చుకోవాలన్నది చాలామందికి ఓ కల తగిన స్థలం ఉన్నాసరే అనుమతుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. ఎంతోమంది చేతులు తడపాలి. అన్నీ...

సొంతింటి కల నెరవేర్చుకోవాలన్నది చాలామందికి ఓ కల తగిన స్థలం ఉన్నాసరే అనుమతుల కోసం అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాలి. ఎంతోమంది చేతులు తడపాలి. అన్నీ లెక్కేసుకుంటే వ్యక్తిగత ఇల్లు పూర్తయ్యేసరికి కోటి దాటడం ఖాయం. ఇక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ తీసుకుంటే నగర శివార్లలో 60 లక్షలకు పైనే ఉంది. అలాంటిది 12 లక్షలకే డుప్లెక్స్‌ ఇల్లు వచ్చేస్తే..! పైగా దాన్ని మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లిపోయే అవకాశం ఉంటే ఇలాంటి ఇళ్లు కలలో మాత్రమే ఉంటాయి అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే ఇంతకీ ఏంటి ఈ ఇళ్లు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరీ చూడాల్సిందే.

ఫ్యాబ్రికేటెడ్ హౌస్ ఈ తరహా ఇళ్లులు ఏనాడో ఫారన్‌లో అందుబాటులోకి వచ్చాయి ఇవి ఇప్పుడు భాగ్యనగరానికి కూడా వచ్చేస్తున్నాయి ప్రస్తుత రోజుల్లో ఓ డబుల్ బెడ్రూ ఇళ్లు కట్టించుకునేందుకు లక్షల్లో ఖర్చు చేయాలి ఇక ప్లాట్లలో ఇళ్లు కొనలన్నా అదే పరిస్థితి అయితే 10లక్షలలోపే ఇళ్లు వచ్చేసిందంటే ఎలా ఉంటుంది పైగా దాన్ని మనం ఎక్కడికంటే అక్కడికి తీసుకువెళ్లిపోయే అవకాశం ఉంటే ఇంకేం కావాలి అనుకుంటున్నారు కదా. ఇంట్లోని సామానులే కాదు.. కావాల్సిన చోటుకి తీసుకుపోయే ఇళ్లను హైదరాబాద్‌లోనే నిర్మిస్తున్నారు. వాటిని చూడాలన్నా, కొనుగోలు చేయాలన్నాఒక్కసారి దూలపల్లికి వెళ్లి రావాల్సిందే. హైదరాబాద్ ప్రస్తుతం ఫ్యాబ్రికేటెడ్ ఇల్లు వెలుస్తున్నాయి అంతే కాకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆర్డర్లు ఇచ్చి మరీ వెంట తీసుకుపోతున్నారు. కదిలే ఇళ్లని క్వాలిటీ తక్కువగా అంచనా వేయొద్దు ఇవి కనీసం ముప్పై ఏళ్లు గ్యారంటీ అంటున్నారు.

మొబైల్ హౌసెస్ తయారి హైదరాబాద్ లోని నగర్ వాసులు అందరు ఎంతగానో ఆసక్తి గా ఉన్నారని అలాగే వేరే ప్రాంతాల నుండ కూడా ఆసక్తి కి వచ్చి కొనుగోలు చేసి తిసుకేల్లడం తో పాటు ఆర్డర్స్ కూడా ఇస్తున్నారని జిలాని అన్నారు. అలాగే కేవలం 4 లక్షల నుండి మొదలు పెట్టుకొని 14 లక్షల వరకు కర్చు అవుతుందని అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా వారె చేస్తారని అంటున్నారు మిగతా చోట్ల నుండి విశాఖపట్నం ,విజయవాడ లో కూడా ఇలాంటివి తాయారు చేయ్యలనుకున్తున్నామని అన్నారు. హైదరాబాదు లో నయా మొబైల్ ట్రెండ్ మొదలవ్వడం తో ప్రతి ఒక్కరు సొంతిల్లు కొనాలంటే ఫ్యాబ్రిక్ హోసేస్ వైపే చూస్తున్నారు మరి రానున్న రోజుల్లో ఫ్యాబ్రిక్ హోసేస్ అమ్మకాలు ఎలా ఉంటాయో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories