మాజీ గవర్నర్ నరసింహన్ అల్ టైం రికార్డ్స్

మాజీ గవర్నర్ నరసింహన్ అల్ టైం రికార్డ్స్
x
Highlights

కేంద్రం ఇటివల కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించిన సంగతి తెలిసిందే . అందులో భాగంగానే తెలంగాణా గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ ని ఎంపిక...

కేంద్రం ఇటివల కొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లను నియమించిన సంగతి తెలిసిందే . అందులో భాగంగానే తెలంగాణా గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ ని ఎంపిక చేసింది . ఇప్పటివరకూ తెలంగాణా గవర్నర్ గా పని చేసిన ఈఎస్ఎల్ నరసింహన్‌ కి ఎలాంటి భాద్యతలు ఇవ్వలేదు . గవర్నర్ గా తన సుదీర్ఘ పదవీకాలాన్ని ముగించుకున్న ఈఎస్ఎల్ నరసింహన్‌ కి తెలంగాణా ప్రభుత్వం ఈ రోజు( శనివారం) వీడ్కోలు పలికింది . అయన ఈ రోజు ప్రత్యేక విమానంలో నరసింహన్‌ దంపతులు బెంగుళూరుకి వెళ్ళిపోయారు.

అయితే, గవర్నర్ గా నరసింహన్‌ చాలా రికార్డులు సృష్టించారు. అందులో ముఖ్యమైనది సుదీర్ఘ కాలం గవర్నర్ గా పనిచేయడమే కాకుండా, రెండు రాష్ట్రాలకు ఆ పదవిని నిర్వర్తించడం కూడా చెప్పుకోదగ్గ రికార్డుగా మిగిలింది. 2009 డిసెంబర్ 27న తెలంగాణ ఉద్యమ సమయంలో నరసింహన్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు .. అ తర్వాత రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి రెండు తెలుగు రాష్ట్రాలకు గవర్నర్ గా భాద్యతలు చేపట్టారు ... కొద్ది నెలల ముందు ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం కొత్త గవర్నర్ ని నియమించగా నరసింహన్ తెలంగాణా రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయ్యారు ..

నరసింహన్ ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్ గా ఎంపిక కాకముందు అంటే 2009 కి ముందు ఛత్తీస్‌గఢ్ కి మూడో గవర్నర్‌గా సేవలు అందించారు. డిసెంబరు 28, 2009 న అదనపు బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ కి 22 వ గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. జనవరి 22, 2010 నుండి పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఇలా మొత్తం తొమ్మిది సంవత్సరాలు గవర్నర్‌గా విధులను నిర్వర్తించిన ఘనత ఆయనకే దక్కింది . అంతే కాకుండా మరో కేటగిరీలో ఆయన రెండో స్థానంలో నిలిచారు. గతంలో సరోజినీ నాయుడు కుమార్తె పద్మజానాయుడు 1956 నవంబరు 3 నుంచి 1967 జూన్‌ 1 వరకు (10 సంవత్సరాల 209 రోజులు) ఒకేచోట పనిచేశారు. దాని తర్వాత నరసింహన్ రెండో స్థానంలో (9 సంవత్సరాల ఎనిమిది నెలలు) ఉన్నారు.

గవర్నర్ పదవి రాజకీయ పదవి కానప్పటికీ, సాధారణంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు తమ పార్టీకి అనుకూలురు లేదా పార్టీలో సేవలందించిన వారికి గవర్నర్ గా అవకాశం కల్పించడం రివాజు. ఈ నేపథ్యంలో ఒక పార్టీ అధికారం కోల్పోగానే, ఆ పార్టీ పదవీ కాలంలో గవర్నర్ గా పనిచేసిన వారిని మార్చివేయడం జరుగుతుంది. కానీ, నరసింహన్ యూపీఏ హయాంలో గవర్నర్ గా ఎన్నికై ఎన్డీయే హయంలో కూడా పూర్తికాలం గవర్నర్ గా కొనసాగారు . ఇలా కొనసాగిన ఒకే ఒక్క గవర్నర్‌గా కూడా నరసింహన్ రికార్డు నెలకొల్పారు. యూపీఏ కాలంలో ఎంపీకైన అందరు గవర్నర్లు మారారు కానీ, నరసింహన్ ఒక్కరే ఎన్డీయే హయాంలో కూడా ఐదేళ్లపాటు గవర్నర్ గా తన భాధ్యతలను కొనసాగించారు. ఇది కూడా అయన పేరిట ఓ రికార్డుగా మిగిలిపోయింది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories