మంత్రి కేటీఆర్ ను కలిసిన మాజీ ఎంపీ.. రాజ్యసభ సీటు..

మంత్రి కేటీఆర్ ను కలిసిన మాజీ ఎంపీ.. రాజ్యసభ సీటు..
x
మంత్రి కేటీఆర్ ను కలిసిన మాజీ ఎంపీ
Highlights

అసెంబ్లీ హాల్‌లో మంత్రి కేటీఆర్‌తో మరోసారి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నానని పొంగులేటి...

అసెంబ్లీ హాల్‌లో మంత్రి కేటీఆర్‌తో మరోసారి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. రాజ్యసభ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నానని పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం రెండు సీట్లకు మాత్రమే అవకాశం ఉందని అనేక సమీకరణాలు సీఎం దృష్టిలో ఉన్నాయని చెప్పారు. తనపై సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు సానుకూల దృక్పథం ఉందన్నారు. జిల్లా రాజకీయాలను సీఎం పరిగణలోకి తీసుకుని సీట్లు కేటాయించారని అన్ని విషయాలపై సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు అవగాహన ఉందన్నారు.

తెలంగాణలో ఖాళీ కాబోతున్న రెండు రాజ్యసభ స్థానాల ఎంపికపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. మార్చి 26న జరగనున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి ఎవరికి పట్టం కడుతారన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలకు రాజ్యసభ స్థానాల్లో పోటీ చేసే అంత బలం లేదు. దీంతో టీఆర్ఎస్ పార్టీకే ఈ రెండు స్థానాలు దక్కనున్నాయి. త్వరలోనే పదవీ కాలం పూర్తి చేసుకోనున్న ఓ సీనియర్ నేతకు, లెక్కలు పక్కా అని చెబుతున్నా మిగిలిన ఒక స్థానం ఎవరిదన్న దానిపై మాత్రం తీవ్రమైన కసరత్తే జరుగుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories