తెలంగాణలో ఒక్కో ఎన్ కౌంటర్ లో ఒక్కో కథ

తెలంగాణలో ఒక్కో ఎన్ కౌంటర్ లో ఒక్కో కథ
x
Highlights

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్ కౌంటర్ లకు ఒక్కో దానికి, ఒక్కో కథ ఉంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్ కౌంటర్ లకు ఒక్కో దానికి, ఒక్కో కథ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మావోయిస్టుల ఎన్ కౌంటర్ లు, కూబింగ్ లు ఎక్కువగా నిర్వహిస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్ కౌంటర్లు మావోయిస్టులపై కాకుండా దోపిడీ దొంగలు, రౌడీలు, ఉగ్రవాదులు, రేపిస్టులకూ విస్తరించాయి.

ఒక్కో ప్రదేశంలో జరిగిన ఈ కాల్పుల వెనకాల ఒక్కో కథనం దాగి ఉంది. వీటికి సంబంధించిన వివరాల్లోకెళితే:

2014 ఆగస్టు 1 : శామీర్ పేట శివారులో జరిగిన ఈ సంఘటనలో పోలీసులకు, నేరస్థులకు మధ్య బాహాబాహీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎన్నో నేరాలను చేసిన ఎల్లంగౌడ్ చేతిలో కానిస్టేబుల్ ఈశ్వరరావు మృతి చెందాడు. అదే సంఘటనలో ఎస్సై వెంకట్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. దొంగల ముఠాకు చెందిన ముస్తఫా అక్కడికక్కడే పోలీసుల చేతిలో మృత్యువాత పడ్డాడు.

2014 ఆగస్టు 14 : ఎన్నో వందల కొద్ది గొలుసు చోరీలకు పాల్పడిన కడలూరి శివకుమార్ కు, పోలీసులకు మధ్య శంషాబాద్ శివారులోని ఓఆర్ఆర్ పై ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో నేరస్తుడు కడలూరి శివ పోలీసుల చేతుల్లో చనిపోయాడు. ఇతన్ని సజీవంగా పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేయగా పోలీసులపై కాల్పులు జరిపి అతను తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు శూట్ ఎట్ సైట్ ఆర్డర్ ను ప్రకటించి కాల్చిచంపారు.

2015 ఏప్రిల్ 4 : సూర్యాపేట బస్టాండులోనూ ఇలాంటి ఒక ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో పోలీసు శాఖకు చెందిన ఇద్దరు చనిపోయారు. వివరాల్లోకెళితే సూర్యాపేట బస్టాండులో పోలీసులు బస్సులను తనిఖీ చేశారు. ఇందులో భాగంగానే అనుమానంగా కనిపించిన ఇద్దరు వ్యక్తులను కిందికి దించి వారి వివరాలను తెలుసుంటున్నారు. అదే సమయంలో అదును చూసుకున్న దుండగులు పోలీసులపైకి తుపాకితో దాడి చేశారు.

ఈ దాడిలో కానిస్టేబుల్ లింగయ్య, హోం గార్డు మహేశ్ దుర్మరణం పాలయ్యారు. సీఐ, మరికొంత మంది హోంగార్డు గాయాలపాలయ్యారు. కాల్పులు జరిపి దుండగులు పారిపోయి జానకీపురంలో తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. అక్కడకూడా వారు కాల్పులు జరపడంతో ఎస్సై సిద్దయ్య, కానిస్టేబుల్ నాగరాజు బలంగా గాయపడ్డారు. దీంతో నాగరాజు అక్కడిక్కడే మృతి చెందగా, సిద్ధయ్య ఆప్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడి.

ఎదురు కాల్పులు జరుగుతున్న సమయానికి అక్కడికి పోలీసు బెటాయిన్ అక్కడికి చేరుకుని దుండగులని హతం చేశారు. వారిని సిమి ఉగ్రవాదులు అస్లామ్ అయూబ్, ఎజాజుద్దీన్ గా గుర్తించారు. వారు అంతకు ముందు మధ్యప్రదేశ్ ఖాండ్వా జైలు నుంచి తప్పించుకుని వచ్చినట్లు తెలిసింది.

2015 ఏప్రిల్ 8 : ఈ సంఘటన వరంగల్ హైదరాబాద్ ప్రధాన రహదారి జనగామ వద్ద చోటు చేసుకుంది. వరంగల్ జైలు నుంచి నాంపల్లి కోర్టుకు డీజేఎస్ అనే సంస్థను నిర్వహిస్తూ చాలామంది పోలీసులను వారి పొట్టనపెట్టుకున్న వికారుద్దీన్, జకీర్, అహ్మద్, హనీఫ్, ఇజార్ ఖాన్ బృందాన్ని తరలిస్తున్నారు. ఈ సమయంలోనే పోలీసులు మూత్రవిసర్జన కోసం వ్యాన్ ను పక్కకు ఆపగా పోలీసుల దగ్గరనుంచి తుపాకీని లాక్కుని పారిపోయే ప్రయత్నం చేసారు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి ఆ ఐదుగురు దుండగులు అక్కడికి అక్కడే హతమార్చారు.

2016 ఆగస్టు 8 : మాజీ నక్సలైట్, కరడు గట్టిన నేరస్తుడు నయీముద్దీన్ ఎన్ కౌంటర్ లో హతమయ్యాడు. ఈ సంఘటన రాష్ట్రంలోనే పెద్ద సంచలనంగా మారింది. షాద్ నగర్ మిలీనియం టౌన్ షిప్ లో వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుకునే ఒక వ్యాపారిని బెదిరించడానికి వెళ్లాడు నయీమ్.

ఈ విషయం గురించి పోలీసలుకు సమాచారం అందగా వారు అక్కడికి చేరుకుని నయీమ్ కోసం కాపు కాచారు. ఆ ఇంటినుంచి బయటికి నయీమ్ రాగానే పోలీసులను గమనించి తన దగ్గరున్న ఏకే47తో కాల్పులు జరిపారు. దాంతో ప్రతిఘటించిన పోలీసులు తిరిగి అతనిపై కాల్పులు జరిపారు. దీంతో నయీమ్ అక్కడికక్కడే మృతి చెందాడు.

2017 డిసెంబర్ : భద్రాద్రి కొత్తగూడెంలో జరిగిన ఎన్ కౌంటర్ లో 8 మంది లంబాడా, ఆదివాసీలు హతమయ్యారు. వీరంగా ఆదివాసీలు కావడంతో పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురిసింది.

2019 జూన్ : ఈ సంఘటన కూడా కొత్తగూడెం జిల్లాలోనే చోటు చేసుకుంది. గుండాల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్ లో న్యూ డెమోక్రసీ దళ నేత లింగన్న చనిపోయాడు. ఈ సంఘటనపై కూడా స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories