Top
logo

మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపిన మంత్రి ఈటల..ఈటలకు రసమయి సపోర్ట్

మరోసారి ఆసక్తికర చర్చకు తెరలేపిన మంత్రి ఈటల..ఈటలకు రసమయి సపోర్ట్
Highlights

వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఆసక్తికర చర్చకు తెర లేపారు. కరీంనగర్లో టీచర్స్ వేడుక సందర్భంగా...

వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ మరోసారి ఆసక్తికర చర్చకు తెర లేపారు. కరీంనగర్లో టీచర్స్ వేడుక సందర్భంగా కలక్టరేట్ ఆడిటోరియంలో జరిగిన సమావేశం ఈ చర్చకు వేదికగా మారింది. కొంతమంది రాజకీయ నాయకులకు మెరిట్ లేదు అన్నారు ఈటల. రాజ్యాంగం రాసుకున్నట్లుగా అమలు జరగడం లేదన్న ఆవేదనను కూడా ఈటల వ్యక్తం చేశారు. అంబేద్కరిజంపై చర్చ జరగాలని పరిస్థితులు మారాలనీ అభిప్రాయపడ్డారు. గురు పూజా దినోత్సవం సందర్భంగా కరీంనగర్లో జరిగిన సమావేశంలో ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజాన్ని టీచర్లే నడపాలని, తాను ఆశావాదినని మార్పు వస్తుందన్న ఆశ తనకు ఉందనీ అన్నారు ఈటల.

ఈటల ఈ కామెంట్ల వెనక ఓ ఆసక్తికర నేపధ్యం ఉంది. ఇదే సమావేశంలో మాట్లాడిన టీఆరెస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈటలకు తనకు నిజాలు మాట్లాడటమే వచ్చునని కడుపులో ఏం దాచుకోమని అన్నారు. తాము ఉద్యమ నేతలమనీ, అబద్ధాలు ఆడటం రాదని రసమయి కామెంట్ చేస్తే జాగర్తగా మాట్లాడంటూ రసమయికి సూచించారు ఈటల.


Next Story

లైవ్ టీవి


Share it