అర్హులందరికీ రెండు పడకల ఇల్లు: మంత్రి దయాకర్

అర్హులందరికీ రెండు పడకల ఇల్లు: మంత్రి దయాకర్
x
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Highlights

తెలంగాణలో ఉన్న పేద ప్రజల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసింది.

తెలంగాణలో ఉన్న పేద ప్రజల కోసం ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేసింది. ఇదే క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామచంద్రాపురంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పూర్తి చేసారు. దీంతో బుధవారం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లలో స్ధానికులు సామూహిక గృహ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ‍యన మాట్లాడుతూ రామచంద్రాపురంలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పూర్తి కావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గ్రామ పంచాయతీలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్రం అభివృద్ది కోసం అమలు చేసిన పథకాలను గురించి తెలియజేసారు. వరంగల్ ప్రాంతంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ను ప్రారంభిస్తారన్నారు. అది ఈ ప్రాంత ప్రజల నిరుద్యోగితను తొలగిస్తుందని, అర్హులైన యువతకు ఉపాధి కల్పిస్తుందన్నారు.

రైతులు వ్యవసాయంలో ముందంజలో ఉండాలన్నదే కేసీఆర్ ధ్యేయం అన్నారు. వారి కోసం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారన్నారు. వికలాంగుకు, వృద్ధులకు అందించే ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రూ.2016 నుంచి 3016కు పెంచారని అన్నారు. మధ‌్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలకు పెళ్లి చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని అన్నారు. వారి కోపం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ వంటి పథకాలను తీసుకొచ్చారని ఈ పథకాలు దేశానికే ఆదర్శమని ఆ‍యన పేర్కొన్నారు. వేల ఎకరాలకు సాగునీరు, ప్రతి గ్రామానికి తాగునీరు అందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మాణానికి కృషిచేసారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు సృష్టించినా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసిన కేసీఆర్ అపరభగీరధుడని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేసిందిలేదన్నారు. ఈ సందర్భంగానే మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై మంత్రి దయాకర్ రావు తీవ్రంగా స్పందించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.


HMTV లైవ్ నుంచి తాజా వార్తా విశేషాల కోసం TELEGRAM ను అనుసరించండి!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories