మంత్రి మహర్షిగా మారితే.. పొలం దున్ని నీరు పెట్టిన మంత్రి ఎర్రబెల్లి

మంత్రి మహర్షిగా మారితే.. పొలం దున్ని నీరు పెట్టిన మంత్రి ఎర్రబెల్లి
x
పొలం దున్ని నీరు పెట్టిన మంత్రి ఎర్రబెల్లి
Highlights

నిత్యం సమీక్షలు, సమావేశాలతో బిజీబీజీగా ఉండే తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాస్త రిలాక్స్ అయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా...

నిత్యం సమీక్షలు, సమావేశాలతో బిజీబీజీగా ఉండే తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాస్త రిలాక్స్ అయ్యారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని తన పొలంలో స్వయంగా ట్రాక్టర్ నడుపుతూ పొలం దున్ని నీరు పెట్టారు. మహిళలతో కలిసి నాటు వేసి చిన్ననాటి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ పారిశుధ్యం, డ్రైనేజీని పరిశీలించారు.

మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధుల గెలుపు కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ కార్యకర్తలను సన్నద్దం చేస్తూనే మరో పక్క తన స్వగ్రామం పర్వతగిరి వచ్చారు. తన పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చిన ఎర్రబెల్లి పొలం గట్టుపై నడుచుకుంటూ వెళ్ళి పచ్చటి కళతో ఉట్టిపడుతున్న పంట భూములను చూసి ఆనందంతో ఉప్పొంగిపోయారు.

స్వయాన మంత్రి ఫార్చూనర్ కారు దిగి అంగరక్షకులను పొలం గట్టున నిలబెట్టి వరి పొలంలో నాటు వేసి, కాసేపు ట్రాక్టర్ డ్రైవర్ గా మారడం చూసిన గ్రామస్తులు ఆశ్చర్య పోయారు. మంత్రి హోదాలో ఉన్న ఆయన స్వయంగా తన పొలాన్ని తానే దుక్కి దున్నడం చూసి అన్నదాతలు ఆనందం వ్యక్తం చేశారు. వ్యవసాయంపై ఆయనకున్న మక్కువ చూసి ప్రశంసించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories