మూగబోయిన మైకులు..ప్రచారానికి తెర..

మూగబోయిన మైకులు..ప్రచారానికి తెర..
x
Highlights

హుజుర్ నగర్ ‌ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. గత ఇరవై రోజులుగా‌ ఆయా పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక పోరులో మొత్తం 28...

హుజుర్ నగర్ ‌ఉప ఎన్నిక ప్రచారం ముగిసింది. గత ఇరవై రోజులుగా‌ ఆయా పార్టీల నేతలు జోరుగా ప్రచారం నిర్వహించారు. హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక పోరులో మొత్తం 28 మంది అభ్యర్ధులు బరిలో నిలిచారు. హుజూర్ నగర్‌ ఉప ఎన్నిక ప్రచారం ఐదు గంటలకు ముగిసింది. ఈ నెల 21వ తేదీన ఉపఎన్నికకు పోలింగ్ జరగనుంది. 24వ తేదీన ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. హుజూర్‌నగర్‌లో మొత్తం 2,36,842 మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 302 పోలింగ్‌స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. 79 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఇతర నియోజకవర్గాలకు చెందిన నాయకులు హుజూర్‌నగర్ విడిచి వెళ్లాలని ఈసీ ఆదేశాలు జారీ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories