Top
logo

దేవికారాణిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు

దేవికారాణిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదు
X
దేవికారాణి
Highlights

ఈఎస్ఐ కేసులో మాజీ డైరెక్టర్ దేవికారాణి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఏసీబీ దగ్గరున్న ఆస్తుల చిట్టా ఆధారంగా...

ఈఎస్ఐ కేసులో మాజీ డైరెక్టర్ దేవికారాణి చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. ఏసీబీ దగ్గరున్న ఆస్తుల చిట్టా ఆధారంగా ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఆమెపై కేసులు నమోదు చేసింది. విదేశాల్లోని వివిధ సంస్ధల్లో దేవికారాణి పెట్టుబడులు గుర్తించిన ఈడీ మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదు చేసింది. నిధులను విదేశాలకు తరలించిన విధానంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె పై మూడు కేసులు ఏసీబీ నమోదు చేసింది. దేవికారాణి భర్తపై కూడా ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వందల కోట్ల వరకు స్కామ్‌ జరిగినట్లు ఏసీబీ గుర్తించింది. ఈడీ-ఐటీకి ఏసీబీ అధికారులు పూర్తి సమాచారం అందించారు.

Web Titleed files money laundering case on devika rani
Next Story